Cricket Rewind 2024: క్రికెట్ ను సుదీర్ఘకాలం ఆడుతున్న కొంతమంది క్రికెటర్లు ఈ ఏడాది తమ ఆటకు గుడ్ బై చెప్పేశారు. ఇందులో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తమ ఆటతో వీరు అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే వీరి నిష్క్రమణ అభిమానులను ఒక్కసారిగా నిరాశకు గురిచేసింది. అయితే ఈ జాబితాలో భారత జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, ఇంకా చాలామంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
జేమ్స్ అండర్సన్
ఇంగ్లాండ్ దిగ్గజ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘకాలం టికెట్ ఆడుతున్న ఇతడు.. ఆట నుంచి నిష్క్రమిస్తున్నట్టు వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో ఇతడు ఒకడు..
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది జనవరిలోనే రిటర్మెంట్ ప్రకటించాడు. సిడ్నీ వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడి.. క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు వివరించాడు.
విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. విరాట్ కోహ్లీ టి20 లకు వీడ్కోలు పలికాడు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించాడు. విరాట్ ప్రస్తుతం వన్డే, టెస్టులలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది టీ20 లకు వీడ్కోలు పలికాడు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కోహ్లీ లాగానే రోహిత్ కూడా టెస్ట్, వన్డే ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు.
రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీ మీడియా టి20 వరల్డ్ కప్ గెలిచినా అనంతరం అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్ లో కంటిన్యూ అవుతున్నాడు.
నీల్ వాగ్నర్
న్యూజిలాండ్ స్టార్ పేస్ బౌలర్ వాగ్నర్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న తన రిటర్మెంట్ ను అతడు ప్రకటించాడు. న్యూజిలాండ్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను దక్కించుకోవడంలో వాగ్నర్ కీలకపాత్ర పోషించాడు.
టిమ్ సౌతి
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు సౌతి కూడా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన బౌలింగ్ ద్వారా తోపు ఆటగాళ్లను అతడు భయపెట్టాడు.
శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లలో ఒకడు. ఆగస్టు 24న అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ -13, ఇతర ఐసీసీ టోర్నీలలో మెరుగైన ప్రతిభ చూపించాడు. తన అద్భుతమైన ఆటతీరుతో కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
మొయిన్ అలీ
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు మొయిన్ అలీ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా సిరీస్ కు అతడిని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. గత కొంతకాలం నుంచి అతడికి అవకాశాలు లభించడం లేదు. దీంతో అతడు క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.
రవిచంద్రన్ అశ్విన్
ఈ ఏడాది టీమిండియా లెజెండరీ స్పిన్ బౌలర్
రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. డిసెంబర్ 18న అతడు తన రిటర్మెంట్ అనౌన్స్ చేసాడు. ఆస్ట్రేలియాతో గబ్బా ముగిసిన అనంతరం.. క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నానని పేర్కొన్నాడు.