MS Dhoni IPL 2023: మాస్టర్ మైండ్ ధోని నుండి మిగిలిన టీం కెప్టెన్లు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే!

ఎంత మంచి ఆటగాళ్లు టీం లో ఉన్నప్పటికీ , ఆ టీం ని సరైన మార్గం లో నడిపించకపోతే వృధా, సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకొని, ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ, ప్రత్యర్థులను తికమక పెట్టడం లో ధోని కి సాటి మరెవ్వరు లేరు.

Written By: Vicky, Updated On : May 30, 2023 9:17 am

MS Dhoni IPL 2023

Follow us on

MS Dhoni IPL 2023: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన 2023 ఐపీఎల్ సీజన్ నిన్నతో గ్రాండ్ గా ముగిసింది.మొన్ననే జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణం గా పక్క రోజుకి వాయిదా పడింది. నిన్న గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరిగిన తర్వాత చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ ప్రారంభం అయ్యేముందు వర్షం కురిసింది. మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఉత్కంఠ నడుమ వర్షం ఆగడం 20 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ ని 15 ఓవర్లకు కుదించి 171 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఈ టార్గెట్ తో రంగం లోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ టీం మొదటి ఓవర్ నుండే గుజరాత్ టైటాన్స్ టీం పై విరుచుకుపడి మ్యాచ్ ని గెలిచి 5 వ సారి IPL ట్రోఫీ గెలిచినా ఛాంపియన్స్ గా చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్ టీం తర్వాత 5 ట్రోఫీలు గెలిచినా ఏకైక టీం చెన్నై సూపర్ కింగ్స్. ఇన్ని ట్రోఫీలు రావడానికి ప్రధాన కారణం మాత్రం మహేంద్ర సింగ్ ధోని అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

ఎంత మంచి ఆటగాళ్లు టీం లో ఉన్నప్పటికీ , ఆ టీం ని సరైన మార్గం లో నడిపించకపోతే వృధా, సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకొని, ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ, ప్రత్యర్థులను తికమక పెట్టడం లో ధోని కి సాటి మరెవ్వరు లేరు. ఎలాంటి కష్టమైన పరిస్థితి ఏర్పడిన కూల్ గా ఉంటూ పరిస్థితి ని తనకి అనుకూలంగా మార్చుకునే జ్ఞాని మహేంద్ర సింగ్ ధోని. అందుకే ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ టీం 14 సీజన్స్ ఆడితే 12 సార్లు ప్లే ఆఫ్స్ కి, 10 సార్లు ఫైనల్స్ కి వచ్చి 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుపొందారు. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ టీం పెద్ద స్ట్రాంగ్ గా ఏమి లేదు. బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉన్నప్పటికీ , బౌలింగ్ ఆర్డర్ గొప్పగా లేదు. ఐపీఎల్ ఆక్షన్స్ లో అసలు అమ్ముడుపోని రహానే ని టీం లోకి తీసుకోమని చెప్పింది ధోని నే , అతని టాలెంట్ ఏంటో ధోని కి బాగా తెలుసు.

తనకి స్వేచ్ఛగా ఈ సీజన్ లో ఆడే అవకాశం కల్పించినందుకు రహానే రెచ్చిపోయాడు. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఫైనల్స్ వరకు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు IPL లో పెద్దగా ప్రభావం చూపని శివమ్ దూబే ఈ సీజన్ లో తన విశ్వరూపం చూపడానికి మహేంద్ర ధోని పాత్ర చాలా ఉంది, అలాగే మలింగా రేంజ్ బౌలర్ అయినా పతిరానా ని ధోని ఉపయోగించినంతగా ఎవ్వరూ ఉపయోగించి ఉండరు. కీలక సమయం లో అతనిని కరెక్టుగా వాడుకున్నాడు. మిగతా జాతులలో పెద్దగా ప్రభావం చూపని ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ లోకి వచ్చిన తర్వాత అలా చెలరేగిపోవడానికి కారణం ధోని నే. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఎలాంటి బాల్స్ ని ఎలా ఎదురుకోవాలి అనేది తన అనుభవం తో నేర్పించి ఛాంపియన్స్ లాగ తయారు చేసాడు. ఈ సీజన్స్ లో మిగిలిన టీమ్స్ తో పోలిస్తే కాస్త వీక్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ టీం ని విజయ తీరాలకు చేర్చి ట్రోఫీ ని గెలిపించిన మహేంద్ర సింగ్ ధోని జర్నీ ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆయనని బాగా పరిశీలించి ఆయన కెప్టెన్సీ స్కిల్స్ ని అర్థం చేసుకొని తమ జట్టులో ఉన్న ఆటగాళ్లను ఉపయోగించుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం లాగ చరిత్ర తిరగరాయోచ్చు.