Odi World Cup 2023
Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఈ సంవత్సరం ప్రతి టీం కూడా తనదైన రీతిలో అద్భుతాలను సృష్టిస్తూ చాలా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా టీం లు వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ కి వెళ్లడానికి ముందు వరుసలో ఉన్నాయి…
అయితే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ తో మ్యాచ్ లు గెలిచిన టీములు ఏవో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
2017 సంవత్సరంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ టీముల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లను కోల్పోయి 417 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ 142 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 275 పరుగుల భారీ స్కోరు తేడా తో విజయం సాధించడం జరిగింది.ఈ మ్యాచ్ లో వార్నర్ 178 రన్స్ చేశాడు. మిచెల్ జాన్సన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా ఆఫ్గనిస్తాన్ మీద 275 పరుగుల భారీ స్కోరు తో గెలవడం జరిగింది…
2007వ సంవత్సరంలో ఇండియా వర్సెస్ బెర్ముడా మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా 257 పరుగుల భారీ స్కోరు తేడా తో గెలవడం జరిగింది. ఇందులో ఇండియా 50 ఒవర్లకి 5 వికెట్లు కోల్పోయి 413 పరుగులు చేయగా బెర్ముడా 156 పరుగులు చేసి అలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ 114 పరుగులు చేయగా, సౌరవ్ గంగూలీ మాత్రం 89 పరుగులు చేశాడు.
2015 వ సంవత్సరంలో సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా టీం 257 పరుగుల భారీ పరుగుల తేడాతో గెలవడం జరిగింది. ఇక ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా టీంలో డివిలియర్స్ 162 పరుగులు చేశాడు. ఇమ్రాన్ తాహిర్ 5 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాట్స్ మెన్స్ ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 151 పరుగులకు ఆల్ అవుట్ అయింది…
2003 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ లో 256 పరుగుల భారీ స్కోరు తో ఆస్ట్రేలియా గెలవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 301 పరుగులు చేయగా, నమిబియా 45 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా టీం లో మాథ్యూ హెడెన్ 88 రన్స్ చేయగా,సైమండ్స్ 59 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్ లో గ్లెన్ మెగ్రత్ 15 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీసి ఆస్ట్రేలియా టీమ్ కి గొప్ప విజయాన్ని అందించాడు…
2007వ సంవత్సరంలో శ్రీలంక వర్సెస్ బెర్ముడా మధ్య జరిగిన మ్యాచ్ లో 243 పరుగుల భారీ స్కోరు తో గెలవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక 321 పరుగులు చేయగా, బెర్ముడా మాత్రం 76 పరుగులకు ఆలౌట్ అయింది.ఇక ఈ మ్యాచ్ లో సంగర్కరా 76, మహిళా జనార్ధనే 85 ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ తో రాణించడం వల్ల శ్రీలంక 243 పరుగుల భారీ రన్స్ తో గెలవడం జరిగింది. బౌలింగ్ లో మహరుఫ్ 4 వికెట్లు తీసి బెర్ముడా బ్యాట్స్ మెన్స్ ని భారీ దెబ్బ తీశాడు…
2011వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 231 పరుగుల భారీ స్కోర్ తేడాతో విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 353 పరుగులు చేయగా, నెదర్లాండ్ మాత్రం 132 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో జక్వస్ కల్లిస్ సెంచరీ చేసి టీమ్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు…