Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి టీం కూడా వరల్డ్ కప్ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే ఆడుతున్నట్లుగా తెలుస్తుంది.ఎందుకంటే ప్రతి టీమ్ కూడా మంచి పోటీ ని ఇస్తూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి టీం కూడా వాళ్ల పూర్తి ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా మ్యాచులు ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో కూడా చాలామంది ప్లేయర్లు వాళ్ళ పరిమితికి మించి బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ టోర్నీ స్టార్ట్ అవ్వక ముడ్ను అందరూ ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టీమ్ లు సెమీస్ కి వెళతాయని భావించారు. కానీ వీటిలో ఒక ఇండియా తప్ప మిగిలిన రెండు టీములు కూడా చతికిల పడిపోయాయి. ఇక మన ఇండియా టీం విషయానికి వస్తే ఇండియా టీం ఇప్పటికే వరుసగా మూడు విజయాలు నమోదు చేసుకొని మంచి ఫామ్ లో ఉంది.ఇక ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇంకో నాలుగు మ్యాచ్ లను కనుక గెలిస్తే ఇండియా డైరెక్ట్ గా సెమి ఫైనల్ గా వెళ్ళిపోతుంది…
ఇక ఇదే క్రమంలో పాకిస్తాన్ టీం రెండు విజయాలను దక్కించుకున్నప్పటికీ అవి పెద్ద విజయాలు అయితే కాదు. ఎందుకంటే పాకిస్తాన్ తనకంటే చిన్న దేశాలు అయిన నెదర్లాండ్, శ్రీలంకల మీద విజయాలను సాధించింది అంతే తప్ప బలమైన టీం అయిన ఇండియా టీం ను ఓడించడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక ఇంకో మ్యాచ్ ఆడితే కానీ పాకిస్థాన్ సెమీస్ పరిస్థితి ఏంటి అనేది తెలియదు.ఇక డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీమ్ న్యూజిలాండ్ మీద ఆడిన మొదటి మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. ఇక ఆ తర్వాత అఫ్గాన్ టీమ్ మీద ఆడిన మ్యాచ్ లో అఫ్గాన్ బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ టీమ్ బ్యాట్స్ మెన్స్ నిలబడలేకపోయారు. దాంతో వాళ్లు నిర్దేశించిన టార్గెట్ ని చేదించలేక ఇంగ్లాండ్ టీమ్ చతికిలబడిపోయింది.
ఇక ఆస్ట్రేలియా టీమ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఇప్పటికే ఐదుసార్లు వరల్డ్ కప్పును గెలిచి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలబడింది. అయినప్పటికీ ఈ వరల్డ్ కప్ లో పెద్దగా మ్యాజిక్ అయితే చేయడం లేదు మొదటగా ఇండియా మీద ఆడిన మ్యాచ్ లో మంచి విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సౌతాఫ్రికా మీద ఆడిన మ్యాచ్ లో దారుణంగా ఫెయిల్ అయింది. ఇక వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా రీసెంట్ గా శ్రీలంక మీద గెలిచి మొదటి విజయాన్ని దక్కించుకుంది. అయితే ఆస్ట్రేలియా పెద్ద టీమ్ అయిన మన ఇండియా సౌతాఫ్రికా టీముల మీద ఓడిపోయి శ్రీలంక లాంటి చిన్న టీం మీద గెలవడం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చిన్న టీమ్ లని ఓడించడం ఈజీనే కానీ కప్పు కొట్టాలంటే స్ట్రాంగ్ టీమ్ లు అయిన ఇండియా, సౌతాఫ్రికా లాంటి టీమ్ లను ఓడించడం కష్టం అంటూ ఆస్ట్రేలియా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు…
ఇక సౌతాఫ్రికా టీమ్ కూడా వరుసగా రెండు విజయాలను అందుకొని మంచి జోష్ లో ఉంది ప్రస్తుతం సౌతాఫ్రికా టీమ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది.
న్యూజిలాండ్ టీమ్ కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండు విజయాలను అందుకుంది.ఇక ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ టీమ్ కూడా సెమీస్ బెర్త్ లో నిలుస్తుంది…
ఇక ఇప్పుడు చూస్తున్న సిచువేషన్ లో ఇండియా, న్యూజిలాండ్ ,సౌత్ ఆఫ్రికా మాత్రమే సెమీస్ బర్త్ కన్ ఫామ్ చేసుకునేలా కనిపిస్తున్నాయి.ఇక వాళ్ళ ఆట తీరు కూడా బాగుంది ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్ల ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో వాళ్ళు వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇండియా ఇప్పటికే మూడు విజయాలను సొంతం చేసుకుంది. కాబట్టి రెండు పెద్ద జట్లను ఓడిస్తే ఇండియా ఆటోమేటిక్ గా సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక మిగిలిన ఏ టీంలు సెమీస్ కి వస్తాయనేది తెలియాల్సి ఉంది.