IPL 2024
IPL 2024: మరి కొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ –17 ప్రారంభం కాబోతోంది. మార్చి 22న టోర్నీ ప్రారంభించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య జరుగనుంది. రెండు నెలల పాటు క్రికెట్ సందడి కొనసాగనుంది. ఇక సీజన్ –17లో గతేడాది మాదిరిగానే 10 జట్లు పాల్గొంటున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి యువ ఆటగాళ్లతో బరిలో దిగుతోంది. అద్భుతాలకు రెడీ అంటున్నారు క్రికెటర్లు.
తొలి దశలో ఉప్పల్‌లో మ్యాచ్‌లు..
ఇక ఐపీఎస్ సీజన్ – 17 ఎడిషన్‌లో తొలిదశ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కొన్ని మ్యాచ్‌లు జరుగనున్నాయి. నగరంలో మ్యాచ్ నేపథ్యంంలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌లు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రెండు మ్యాచ్‌లు..
తొలిదశ షెడ్యూల్‌లో భాగంగా ఐపీఎల్ సీజన్ –17లో రెండు మ్యాచ్‌లు ఉప్పల్‌లో జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ మార్చి 27న జరుగుతుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 5న జరుగుతుంది. ఇందులో హైదరాబాద్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.
రెండో దశ విదేశాల్లో..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు భారత్‌లో జరగవని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్టులను సేకరించాయి. అయితే బీసీసీఐ వర్గాలు మాత్రం లీగ్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని పేర్కొంది. లీగ్‌లో మొత్తం 10 జట్లు ఆడుతున్నా. హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో జరుగుతాయని ప్రకటించింది.