https://oktelugu.com/

Sreemukhi: సీరియల్ నటుడితో ప్రేమలో పడ్డ శ్రీముఖి… ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో!

ఓ సీరియల్ నటుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఏకంగా స్టేజి మీదే అతనికి ప్రపోజ్ చేసింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. కాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఎప్పటిలానే రెండు సీరియల్స్ లోని నటులు పోటీ పడేందుకు వచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 22, 2024 / 08:26 AM IST

    Sreemukhi

    Follow us on

    Sreemukhi: బుల్లితెర పై టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది శ్రీముఖి. స్టార్ మాలో శ్రీముఖి చేసే షోలు మంచి టీఆర్పీ దక్కించుకుంటున్నాయి. తన ఎనర్జీ లెవెల్స్, చలాకి మాటలు, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో కూడా శ్రీముఖి హవా సాగిస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా స్టార్ మా ఛానల్ లో దర్శనమిస్తుంది. పలు షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో లవ్ మ్యాటర్ బయటపెట్టి షాక్ ఇచ్చింది.

    ఓ సీరియల్ నటుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఏకంగా స్టేజి మీదే అతనికి ప్రపోజ్ చేసింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. కాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఎప్పటిలానే రెండు సీరియల్స్ లోని నటులు పోటీ పడేందుకు వచ్చారు. గుండెనిండా గుడిగంటలు, వంటలక్క సీరియల్ లోని ఆర్టిస్టులు షో లో పాల్గొన్నారు. అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు ని చూసి శ్రీముఖి మెలికలు తిరిగింది.

    బాలు ని చూడగానే నా గుండెల్లో గంటలు మోగాయి అంటూ చెప్పుకొచ్చింది. అతనితో కలిసి డాన్స్ చేస్తూ రచ్చ చేసింది. అంతే కాదు తన ప్రేమను వ్యక్తం చేస్తూ బాలు పై కవితలు కూడా చెప్పింది. తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అతనికి తెలుగు రాకపోవడంతో శ్రీముఖి మాటలకు ఏం చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూశాడు. చివరికి అతనికి తెలుగు కూడా నేర్పించింది. బాలుకి అక్షరాభ్యాసం చేయించింది.

    బాలు చెయ్యి పట్టుకుని అక్షరాలు రాయిస్తూ .. ఐ లవ్ యు శ్రీముఖి అంటూ రాయించింది. అలా తన ప్రేమ కురిపించింది. అయితే శ్రీముఖి ఇందంతా షోలో భాగంగా ఫన్ కోసం చేసింది. ఒక వైపు షోలు, మరోవైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. శ్రీముఖికి హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నా ఒప్పుకోవడం లేదని టాక్. చిన్నాచితకా చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ప్రయోజనం ఉండదని ఆమె భావిస్తున్నారట.