https://oktelugu.com/

Nara Rohith & Sireesha Engagement : బిగ్ బ్రేకింగ్ : యంగ్ హీరోయిన్ తో హైదరాబాద్ లో నారా రోహిత్ నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

సినీ ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన నటుడు నారారోహిత్. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన నేడు ప్రముఖ యంగ్ హీరోయిన్ సిరిలెల్లా అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 02:21 PM IST

    Nara Rohith & Sireesha Engagement

    Follow us on

    Nara Rohith & Sireesha Engagement :  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన నటుడు నారారోహిత్. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన నేడు ప్రముఖ యంగ్ హీరోయిన్ సిరిలెల్లా అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. నారా ఫ్యామిలీ తో పాటుగా నందమూరి ఫ్యామిలీ కూడా ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొన్నారు. నారా రోహిత్ రీసెంట్ గానే సిరి లెల్లా తో ‘ప్రతినిధి 2’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. సిరి లెల్లా కి ఇదే తొలి తెలుగు సినిమా. అంతకు ముందు ఆమె పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు నారా రోహిత్ కి ఇండస్ట్రీ లో అత్యంత సన్నిహితులలో ఒకరైన యంగ్ హీరో శ్రీ విష్ణు తో పాటు, మరికొందరు హాజరు అయ్యారు. బాణం సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన నారా రోహిత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్స్ ఏమి లేకపోయినప్పటికీ, నటన పరంగా, స్క్రిప్ట్ సెలెక్షన్స్ పరంగా ఒక కొత్తధనం ని ప్రేక్షకులకు పరిచయం చేసాడు.

    ఆయన నటించిన సినిమాలలో ‘సోలో’ అనే చిత్రం అప్పట్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ద్వారానే ప్రముఖ డైరెక్టర్ పరశురామ్ పెట్ల ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలలో ‘ప్రతినిధి’ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది, కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సరికొత్త కథాంశం తో ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఆ తర్వాత ఈయన ప్రముఖ యంగ్ హీరో శ్రీ విష్ణు తో కలిసి ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకి కూడా ఆడియన్స్ నుండి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా సాగర్ కె చంద్ర అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

    ఈయన పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈయన ‘ప్రతినిధి 2’, ‘సుందరాకాండ’ వంటి చిత్రాలు విడుదల చేసాడు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా ఆడియన్స్ కి తెలియదు. అంత పెద్ద ఫ్లాప్స్ అయ్యాయి. ప్రస్తుతం ఒక సరైన సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నారారోహిత్ , త్వరలోనే రాజకీయ అరంగేట్రం కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యే గా ఎదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి పెళ్లి తర్వాత ఇతని కెరీర్ లో ఏదైనా మార్పు వస్తుందా లేదా అనేది.