Champions trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతున్నది. మరి కొద్ది రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి అన్ని జట్లు ఈ ట్రోఫీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన జట్లు.. ట్రోఫీని నెగ్గడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అయితే ఈసారి 8 మంది ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరం కానున్నారు..
పాట్ కమిన్స్(pat cummins)
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది కష్టమే. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఆండ్రు మెక్ డోనాల్డ్ ప్రకటించాడు. కమిన్స్ కు చీలమండ గాయం ఇంకా మారలేదు. అందువల్లే అతడు ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. టాప్ స్టార్స్ లో ఒకడైన కమిన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడం ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఇబ్బందే.
బుమ్రా(Bhumra)
టీమ్ ఇండియా స్పీడ్ గన్ బుమ్రా(Bhumra) వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్లే అతడు ఇంగ్లాండ్ సిరీస్లో ఆడలేదు.. మరోవైపు అతడి సామర్థ్యంపై ఇంతవరకు ఎటువంటి అప్డేట్ బీసీసీఐ ఇవ్వడం లేదు. అయితే ఈసారి అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది కష్టమేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జోష్ హేజిల్ వుడ్
ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ హేజిల్ వుడ్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అందువల్ల అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. ఒకవేళ అతడు గాయం నుంచి కోలుకుని.. ప్రాక్టీస్ మళ్లీ మొదలుపెట్టిన ఇబ్బందేనని.. గాయం తిరగబెట్టే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా జట్టు వర్గాలు చెబుతున్నాయి.
మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మార్ష్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అందువల్లే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. అతడు లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఆస్ట్రేలియా జట్టు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
స్టోయినిస్
ఆస్ట్రేలియా జట్టులో మరో కీలక ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇటీవల అతడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన నెల తర్వాత అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇతడితో కలిపి మొత్తం నలుగురు స్టార్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు.
లాకీ పెర్గూసన్
న్యూజిలాండ్ జట్టు పేస్ బౌలర్ లాకీ పెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతడు కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడేది అనుమానంగానే ఉంది.
నోకియా
సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ నోకియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానమే. ఎందుకంటే అతడు వెన్ను నొప్పితో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాడు. దాని నుంచి అతడు కోలుకోకపోవడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానమేనని తెలుస్తోంది.
సయీమ్ అయూబ్
పాకిస్తాన్ యువ సంచలనం సయీమ్ అయూబ్ చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.. అందువల్లే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.