Ravichandran Ashwin: ఇన్నేళ్ళ ఆటలో మెరుగుదల లేదట.. తల్లి చీవాట్లు.. అశ్విన్ బాధ మామూలుగా లేదు

రవిచంద్రన్ అశ్విన్ 2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్టు ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి టెస్ట్ లో అతడు రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 128 పరుగులు ఇచ్చి, 9 వికెట్లు నేలకూల్చాడు. ఆ టెస్టులో భారత్ విజయం సాధించేలా కృషి చేశాడు.

Written By: Suresh, Updated On : March 14, 2024 9:54 am

Ravichandran Ashwin

Follow us on

Ravichandran Ashwin: రవిచంద్రన్.. టెస్టుల్లో ఇటీవలే 500 వికెట్ల మైలురాయి సాధించాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏకంగా 26 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా తన సత్తాను మరోసారి చాటాడు. రాజ్ కోట్ టెస్టులో తన మాతృమూర్తికి ఆరోగ్యం బాగా లేకపోతే అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. ఒకరోజు తన తల్లి వద్ద ఉండి.. మళ్లీ మరుసటి రోజు ఆటలో భాగస్వామయ్యాడు. ఈ చిన్న ఉదాహరణ చాలు రవిచంద్రన్ అశ్విన్ కు ఆట అంటే ఎంత మక్కువో చెప్పడానికి. మరి అంతటి అశ్విన్ ఆట తీరు ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ మారలేదా? ఈ మాట అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు ఆయన మాతృమూర్తి.. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా చెప్పుకున్నాడు. చెప్పుకుంటూ బాధపడ్డాడు (అందులో ఆనందం ఉంది)..

రవిచంద్రన్ అశ్విన్ 2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్టు ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి టెస్ట్ లో అతడు రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 128 పరుగులు ఇచ్చి, 9 వికెట్లు నేలకూల్చాడు. ఆ టెస్టులో భారత్ విజయం సాధించేలా కృషి చేశాడు.. ఆ తర్వాత ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ధర్మశాల టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి 128 పరుగులకు 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇది అశ్విన్ అభిమానులకు ఘనతలాగే కనిపించవచ్చు. సేమ్ అలాంటి గణాంకాలు నమోదు చేశాడని ఆశ్చర్యం అనిపించవచ్చు. అశ్విన్ మాతృమూర్తికి మాత్రం అదేం ఘనత లాగా అనిపించలేదు. “ఇన్ని సంవత్సరాలపాటు ఆట ఆడినా ఎటువంటి మెరుగుదల లేదంటూ” నిట్టూర్చిందట.. ఈ విషయాన్ని అశ్విన్ ట్విట్టర్ వేదికగా చెప్పుకుంటూ బాధపడ్డాడు.. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “మీ అమ్మగారికి ఇప్పటికైనా చెప్పండి.. నేను కనీసం ఆటగాడికైనా ఉన్నానని” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ప్రభుత్వ ఉద్యోగం కాకుండా.. ఎలాంటి ఘనతలు సాధించిన తల్లులు ఒప్పుకోరు ఎందుకో” అంటూ మరో నెటిజన్ తన నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు.

రవిచంద్రన్ ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ కేటగిరీలో నెంబర్ వన్ బౌలర్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై అద్భుతమైన ప్రదర్శన చూపడంతో అతడు ఈ ఘనత సాధించాడు. 2015లో రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ కేటగిరీలో నెంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గా అవతరించాడు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ రెండవ స్థానం, భారత పేసుగుర్రం బుమ్రా మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు.. ఇంగ్లాండ్ సిరీస్ లో అశ్విన్ తర్వాత ఆ స్థాయిలో ప్రతిభ చూపిన చైనామన్ కులదీప్ యాదవ్ 15 స్థానాలు మెరుగుపరచుకొని 16వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.