Surya Kumar Yadav
Surya Kumar : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి నెల ముందు ఇంగ్లండ్(England) జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 మ్యాచ్‌లు బుధవారం(జనవరి 22)నుంచి ప్రారంభం కానున్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్, భారత్ తలపడడం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తయిన ఇంగ్లాండ్.. ఈ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. దీంతో ఈ సిరీస్ సరసవత్తరంగా మారింది. 2024 లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యాకు బీసీసీఐ(BCCI) షాక్ ఇచ్చింది. సూర్యుకుమార్‌ను కెప్టెన్‌గా నియమించింది.
సారథిగా సూపర్ హిట్
సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా కీలక విజయాలు సాధించింది. పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్(Bangladesh)తోనూ ఇదే ఫలితం రాబట్టాడు. తర్వాత సౌత్‌ఆఫ్రికా పర్యటనలో 3–1తో టీమిండియాను గెలిపించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యాతో అనుబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సూర్యకుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
చాలామంది కెప్టెన్లు.
మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారని సూర్యకుమార్ తెలిపారు. హర్ధిక్(Hardik) తనకు మంచి స్నేహితుడని వెల్లడించాడు. జట్టును ఎలా నడిపించాలో అందరికీ తెలుసని వెల్లడించారు. మైదానంలో దిగాక అందరూ జట్టు విజయం కోసమే కృషి చేస్తారన్నారు. మైదానంలో అవసరమైనప్పుడు అందరూ కెప్టెన్‌గా సూచనలు చేస్తానని పేర్కొన్నారు.
కోచ్‌తో కలిసి..
ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్(Goutham Gambheer)తో కూడా కలిసి పనిచేస్తానని తెలిపాడు. ఆయన ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తారన్నారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలో వెళ్తుందని పేర్కొన్నారు. వికెట్ కీపర్‌గా సంజూశాంసన్ బాగా ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లు
టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా సమయం ఉందని ఆలోగా ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యమని సూర్యకుమార్ తెలిపారు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. తమ భవిష్యత్ ప్రణాళికను వివరించాడు.
బాగా ఆడలేదు కాబట్టే
ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ–2025 జట్టులో స్థానం దక్కక పోవడంపైనా సూర్యకుమార్ స్పందించారు. వన్డే ఫార్మాట్‌లో తన ప్రదర్శన బాగా లేనందునే ఎంపిక కాలేదన్నారు. వన్డేల్లో తన ప్రదర్శన నిరాశపర్చిందని నిజాయతీగా వెల్లడించాడు. టీ20 సిరీస్ విజయమే తమ లక్ష్యమని తెలిపాడు.