Surya Kumar Yadav and Aman Jyoti Kaur: క్రికెట్లో సంచలనాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.. అద్భుతాలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. అయితే టీమిండియా విషయంలో మాత్రం అద్భుతాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. 2024 t20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో.. మైదానంలో టీమిండియా అద్భుతం చేస్తే.. ఏడాది గ్యాప్ తో భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో పునరావృతం చేసింది.. దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది..
టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. టీమిండియాలో విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత చేజింగ్ మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా ఒకానొక దశలో టీమిండియాను ఓడించే విధంగా కనిపించింది. ముఖ్యంగా క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. అతనికి మిల్లర్ కూడా తోడు కావడంతో టీమ్ ఇండియాకు ఓటమి తప్పదు అనుకున్నారు. ఈ దశలో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని అంచనా వేయలేక క్లాసెన్ ఔట్ అయ్యాడు. అతడు అవుట్ అయిన కొద్దిసేపటికే మిల్లర్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో మిల్లర్ కొట్టిన బంతి చాలా ఎత్తుకు ఎగిరింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ దానిని అత్యంత జాగ్రత్తగా అందుకున్నాడు. దీంతో మిల్లర్ వెనక్కి వెళ్లక తప్పలేదు. ఆ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. టీమ్ ఇండియాకు 2007 తర్వాత మళ్ళీ టి20 వరల్డ్ కప్ అందించింది. ఇప్పటికీ కూడా ఆ క్యాచ్ గురించి ప్రస్తావన వస్తే సూర్య కుమార్ యాదవ్ ముఖం వెలిగిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ క్యాచ్ వల్ల అతడు టీమ్ ఇండియాకు సారధి కూడా అయిపోయాడు ..
ఇక ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఫీల్డర్ అమన్ జ్యోత్ కౌర్ కూడా డేంజరస్ లారాను అలానే అవుట్ చేసింది. దీప్తి శర్మ బౌలింగ్లో లారా భారీ షాట్ కొట్టింది. బంతి భారీ ఎత్తున లేచింది. దీంతో ఆ క్యాచ్ ను కౌర్ అద్భుతంగా పట్టింది. వాస్తవానికి ఆ బంతిని అందుకునే క్రమంలో కౌర్ తీవ్ర ఒత్తిడికి గురైంది. బంతి రెండు చేతుల్లో ఇమడలేకపోయింది. ఒక దశలో కిందపడే అవకాశం ఏర్పడింది. ఇదే క్రమంలో కౌర్ ఆ బంతిని అత్యంత జాగ్రత్తగా అందుకుంది. దీంతో లారా అవుట్ కాక తప్పలేదు. ఫలితంగా టీమిండియాలో హర్షం వ్యక్తం అయింది. లారా అవుట్ అయిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు మిగతా ప్లేయర్లు వెనక్కి వెళ్లిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. 2024లో సూర్య కుమార్ యాదవ్.. 2025లో కౌర్ దాదాపు ఒకే విధమైన క్యాచ్ లు అందుకున్నారు. టీమిండియా కు అద్భుతమైన విజయాలను అందించారు. అయితే రెండుసార్లు కూడా టీమిండియా కు ప్రత్యర్థులు దక్షిణాఫ్రికా జట్టు కావడం విశేషం.