Chevella road accident: చేవెళ్లకు సమీపంలోని మీర్జాగూడ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించి మీడియాలో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఈ రోడ్డు బాగోలేదని.. విస్తరణకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయని.. ఈ రోడ్డును గనుక విస్తరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తొలిసారిగా ఈ ప్రమాదానికి కారణమేమిటో బయటపడింది.
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మృతుల కుటుంబాలను పరామర్శించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు వచ్చారు. పైగా ఈ ప్రమాదం కూడా అత్యంత పెద్దది కావడంతో రాజకీయ నాయకులు వచ్చారు. సహజంగానే రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత సంఘటన జరిగిన ప్రాంతంలో హడావిడి ఉంటుంది. పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రాజకీయ నాయకులకు భద్రత కల్పిస్తారు. ఆ తర్వాత బాధితులతో రాజకీయ నాయకులు మాట్లాడుతారు.. ప్రభుత్వం తరఫున పరిహారం వచ్చేందుకు కృషి చేస్తామని అధికార పార్టీ నాయకులు.. జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నాయకులు మీడియా ఎదుట అంటుంటారు. కానీ చేవెళ్ల ప్రమాదానికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ ప్రమాదానికి కారణమేమిటో ఆయన స్వయంగా వెల్లడించడంతో.. అసలు విషయం వెలుగు చూసింది.
రోడ్డు ప్రమాదానికి కారణం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, సబితా ఇంద్రా రెడ్డి అని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఈ రోడ్డు విస్తరణకు వారంతా కూడా అడ్డంకులు సృష్టించడంతో నిర్మాణం ముందుకు సాగడం లేదని అతడు ఆరోపించాడు. అంతేకాదు మృతుల కుటుంబాలను పరామర్శించడానికి సబితా ఇంద్రారెడ్డి వస్తే.. ఆమెను అడ్డుకున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశాడు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని.. రోడ్డు విస్తరణకు గనుక సహకరించుకుంటే ఇంతటి దారుణం చోటుచేసుకుని ఉండేది కాదని అతడు పేర్కొన్నాడు. అతడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
యాదయ్య మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినప్పుడు వారంతా కూడా అతనిపై ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో అతడు వచ్చినదారి వెంటనే వెళ్లిపోయాడు. మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా బాధితులను పరామర్శించడానికి వచ్చారు. ఆమెను కూడా వెళ్లిపోవాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం మీరేనంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ రోడ్డు విస్తరణకు అటు ప్రతిపక్ష.. ఇటు అధికార పక్ష నాయకులు అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ఆ ముగ్గురే : స్థానికుడి ఆగ్రహం.. | ABN Telugu#Chevella #BusAccident #RTCBusAccident #TelanganaNews @abntelugutv pic.twitter.com/wYCApHsCwY
— ABN Telugu (@abntelugutv) November 3, 2025
మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత
ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నిరసన సెగ
15 ఏళ్లు మంత్రిగా ఉంది ఈ ప్రాంతానికి ఏం చేయలేదు
” నువ్వు ఏం చేయలేదు ఎందుకు చూడనిక వస్తున్నావు అంటూ సబిత… pic.twitter.com/cOKWR2XYOI
— Telangana365 (@Telangana365) November 3, 2025