https://oktelugu.com/

Raja Saab: కల్కి హిట్టు తో రాజాసాబ్ లెక్కలు మారబోతున్నాయా..?

Raja Saab: ప్రస్తుతం కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సమయంలో ప్రభాస్ చేస్తున్న తరువాత సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 4, 2024 / 12:20 PM IST

    Raja Saab calculations are going to change with Kalki Hit

    Follow us on

    Raja Saab: రీసెంట్ గా కల్కి సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ప్రభాస్ వరుసగా రెండో సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ‘ బాహుబలి 2 ‘ తర్వాత వచ్చిన మూడు సినిమాలు నిరాశ పరచడంతో ప్రభాస్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ‘సలార్ ‘ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక దాని తర్వాత వచ్చిన ‘కల్కి ‘ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి.

    ప్రస్తుతం కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సమయంలో ప్రభాస్ చేస్తున్న తరువాత సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రభాస్ తన తర్వాత చేయబోయే సినిమాలన్నీ కూడా భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం…ఇక అందులో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మరొక సినిమా.. ఈ రెండు సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇక వరుసగా భారీ సినిమాలే చేస్తున్నాం అనుకున్న ప్రభాస్ మధ్యలో ఏదైనా కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాడు.

    ఇక ఆ ఉద్దేశ్యంతోనే మారుతి లాంటి ఒక మీడియం రేంజ్ డైరెక్టర్ డైరెక్షన్ లో ‘రాజాసాబ్ ‘అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ కి రెడీ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కల్కి సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది. కాబట్టి 300 కోట్లతో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రభాస్ కూడా చాలా రోజుల నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాను చేయలేకపోతున్నాడు.

    కాబట్టి ప్రేక్షకుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని మారుతి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు… కల్కి సినిమా సక్సెస్ అయింది. కాబట్టి రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుపుకునే అవకాశాలైతే ఉన్నాయి…అలాగే ఈ సినిమా ఆవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా చాలా మంచి వసూళ్లను రాబడుతోంది అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది…