Virat kohli: విరాట్ కోహ్లీ.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ అతడి కెప్టెన్సీ పదవికి తెరపడబోతోంది. ఇప్పటికే ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంను ఫైనల్ చేర్చలేక కోహ్లి విఫలమయ్యాడు. ఇప్పుడు టీమిండియాను ఫైనల్ చేరుస్తాడా? తన జీవితంలో తొలి కప్ ను అందుకుంటాడా? అన్న సంగతి ఉత్కంఠగా మారింది.

అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా దిగిపోతుండగానే కొందరు సినీ మేకర్స్ అతడి బయోపిక్ తీయడానికి రెడీ అయ్యారు.ఇప్పటికే ఎంఎస్ ధోని బయోపిక్ ఎంతో ఆసక్తి రేపింది. దేశవ్యాప్తంగా ప్రజలకు కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సచిన్ బయోపిక్ అంతగా ఆదరణ పొందలేదు.
ఇప్పుడు ఇదే బాటలో విరాట్ కోహ్లీ బయోపిక్ రాబోతోంది. విరాట్ అంటేనే పట్టుదలకు, ఫిట్ నెస్ కు, కసికి, కోరిక, సాధించడానికి ప్రతీకం. అతడి నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. కానీ అతడి కెప్టెన్సీలో భారత్ కు ఒక్కటంటే ఒక్క ప్రపంచకప్ కూడా అందకపోవడమే మరకగా మారింది. ఇప్పుడు ప్రపంచకప్ టీ20లో అందుకుంటే దాన్ని భర్తీ చేసిన వారవుతారు.
ఈ క్రమంలోనే విరాట్ బయోపిక్ ఆలోచనను బయటపెట్టాడు తెలుగు హీరో అఖిల్. అఖిల్ కూడా ఓ క్రికెటర్ అవుదామనుకొని దాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చాడు. అఖిల్ క్రికెట్ బాగా ఆడగలడు. ఇక విరాట్ జీవితంలో క్రికెట్ తోపాటు బాలీవుడ్ హీరోయిన్ అనుష్కతో లవ్, డేటింగ్, మ్యారేజ్ ఇలా కావాల్సినంత మసాలా ఉంది. సో దీన్ని తెరకెక్కించడానికి బోలెడు స్కోప్ ఉంది. కానీ దీన్ని అఖిల్ తో మేకర్స్ తీస్తారా? లేదా ? అన్నది డౌట్. విరాట్ బయోపిక్ అంటే వరల్డ్ వైడ్ సినిమా. ఇందులో తెలుగులో ఒక్క భారీ హిట్ లేని అఖిల్ ను తీసుకుంటారా? అంటే డౌటేనంటున్నారు. చూడాలి మరీ..