https://oktelugu.com/

Maha samudram movie Twitter Review : “మహా సముద్రం” ట్విట్టర్ రివ్యూ..

Maha samudram movie Twitter Review : విడుదలకు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసిన సినిమా “మహా సముద్రం”. శర్వానంద్, సిద్దార్థ్ వంటి యంగ్ హీరోల కలయికలో మల్టీ స్టారర్ గా మొదలైన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ తోనే క్యూరియాసిటీ ఫిల్ చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ముందే పడ్డాయి. మరి, ఈ సినిమాపై నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో […]

Written By:
  • Rocky
  • , Updated On : October 14, 2021 / 09:28 AM IST
    Follow us on

    Maha samudram movie Twitter Review : విడుదలకు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసిన సినిమా “మహా సముద్రం”. శర్వానంద్, సిద్దార్థ్ వంటి యంగ్ హీరోల కలయికలో మల్టీ స్టారర్ గా మొదలైన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ తోనే క్యూరియాసిటీ ఫిల్ చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ముందే పడ్డాయి. మరి, ఈ సినిమాపై నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    శర్వానంద్, సిద్దార్థ్ కు జోడీగా.. అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరీ నటించారు. అయితే.. ఈ సినిమాలో కాస్టింగ్ తోపాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం దర్శకుడు. RX 100తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎకే ఎంటర్‌మైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

    సినిమా 2017 నుంచి మొదలవుతుంది. ఇద్దరు స్నేహితుల బ్యాక్ డ్రాప్‌ తో కథ చెప్పడం ప్రారంభించారు దర్శకుడు. దోస్తుల మధ్య ఉండే భావోద్వేగాలను ఆకట్టుకొనేలా పలికించాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

    ఫస్టాఫ్ చాలా బాగుందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుందని క్లాప్స్ కొడుతున్నారు. ఇక, ఇంటర్వెల్ ఫైట్ సినిమాకే హైలెట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమా స్లోగా ప్రారంభమైనప్పటికీ.. ఇంటర్వెల్ సమయానికి మంచి జోష్‌తో పికప్ అయిందని, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి, సినిమా మొత్తం ఎలా ఉంది అన్నది తెలుసుకోవడానికి.. “ఓకే తెలుగు” పర్ ఫెక్ట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి.

    ఇక బిజినెస్ చూస్తే.. మహా సముద్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఎక్కువ థియేటర్లలో కూడా రిలీజ్‌కు సిద్దమైంది. నైజాంలో 210 థియేటర్లు, ఆంధ్రాలో 250, సీడెడ్‌లో 110కిపైగా థియేట్లర్లలో బొమ్మ పడుతోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 550కిపైగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహాసముద్రం మూవీ రూ.12.6 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు టాక్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మొత్తంగా 14 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. మరి, ఎంతవరకు రీచ్ అవుతున్నది చూడాలి.