IPL Retention List : రి టెన్షన్ లిస్ట్ మరి కొన్ని గంటల్లో.. ఐపీఎల్ రూల్స్ ఈసారి ఎలా ఉన్నాయంటే?

ఐపీఎల్ 2025 సీజన్ కు రంగం సిద్ధమైంది. త్వరలో మెగా వేలం జరగనుంది. దానికంటే ముందు ఈనెల 31 లోగా ఆయా జట్లు రిటైన్ ప్లేయర్ల లిస్ట్ సబ్ మిట్ చేయాల్సి ఉంది..

Written By: Anabothula Bhaskar, Updated On : October 30, 2024 9:26 pm

IPL Retention List

Follow us on

IPL Retention List :  గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు జట్లు తమ ఆటగాళ్ల రి టెన్షన్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంది. ఇంతకీ ఈసారి రూల్స్ ఎలా ఉన్నాయి? ఫ్రాంచైజీలు ఎలాంటి డిమాండ్స్ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాయి? అంతిమంగా బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే విషయాలపై ఆసక్తికర కథనం.

ఒక జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసలు బాటు ఉంది. ఇందులో తక్కువలో తక్కువ ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండొచ్చు. మొత్తంగా చూస్తే ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఆర్టీఎం కార్డు వినియోగించి వేలం ద్వారా ఆటగాళ్లను దక్కించుకోవచ్చు. ఇందులో విదేశీ ఆటగాళ్లకు ఎటువంటి పరిమితి లేదు. ఈ ప్రకారం మొత్తం ఐదు విదేశీ ఆటగాళ్ళను కూడా వెంట ఉంచుకోవచ్చు.

ప్రత్యక్షంగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు జట్లు ₹ 18, ₹14, ,₹11 కోట్లు ఇస్తాయి. మిగతా ఇద్దరి ఆటగాళ్ల కోసం ₹18, ₹14 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ఇదే జాబితాలో అన్ క్యాప్డ్ ప్లేయర్ ను అంటి పెట్టుకోవాలి అనుకుంటే నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

అన్ క్యాప్డ్ ప్లేయర్ అంటే.

అన్ క్యాప్డ్ ప్లేయర్ అనే విభాగం కేవలం భారతీయ ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఒక భారతీయ ఆటగాడు ఐదు సంవత్సరాల క్యాలెండర్ ఇయర్ లో అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్ లోనైనా జాతీయ జట్టులో చోటు దక్కించుకోకూడదు. ఆ ఆటగాడు బిసిసిఐ తో సెంట్రల్ కాంట్రాక్టు కుదుర్చుకోకూడదు. అలాంటి ఆటగాడినే అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తారు.

పర్స్ వాల్యూ పెరిగింది

ఫ్రాంచైజీ పర్స్ వేల్యూను బీసీసీఐ 120 కోట్లకు పెంచింది. రి టెన్షన్ స్లాబ్ విధానం ద్వారా ఐదుగురు క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలంటే 75 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి అదనంగా మరో అన్ క్యాప్డ్ ప్లేయర్ ను జట్టులో ఉంచాలనుకుంటే నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇదే క్రమంలో ఆ జట్టు మెగా వేలంలో 41 కోట్లతో వేలంలో పాల్గొనాలి.

ఆర్టీఎం లో అనేక మార్పులు..

వేలంలో ఎటువంటి లిమిట్ లేకుండా ఆటగాళ్లను దక్కించుకునే విధానాన్ని ఆర్టీఎం ద్వారా జట్ల యాజమాన్యాలకు దక్కింది.. అయితే ఈసారి ఒక చిన్న మార్పు చేపట్టారు. ఒక ఆటగాడి కోసం ఫ్రాంచైజీ బిడ్ వేస్తే.. అతడిని సొంతం చేసుకోవడం కోసం మరో బిడ్ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకి హైదరాబాద్ ఆటగాడిని చెన్నై 15 కోట్లకు సొంతం చేసుకుందానుకుందాం. అయితే ఆటగాడిని చెన్నై తమ వద్ద ఉన్న ఆర్టీఎం ద్వారా 15 కోట్లు వెచ్చించి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా చెన్నై ముందుకు వస్తే హైదరాబాద్ ఆటగాడి ధరను మరింత పెంచడానికి వేలాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. వేల ఆటగాడు 20 కోట్ల వరకు ధర పలికితే.. అప్పటికే అతడిని దక్కించుకోవాలంటే చెన్నై గరిష్టంగా ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే హైదరాబాద్ 20 కోట్లకు ఆ ఆటగాడిని తీసుకుంటుంది.