paris Olympics 2024: భారత హాకీ జట్టు సెమీస్ వెళ్లిన ఆనందం ఆవిరి.. కీలక ఆటగాడి పై వేటు

గ్రేట్ బ్రిటన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్ అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్డ్ జారీ చేయడం సంచలనగా మారింది. అతడు మైదానం నుంచి బయటికి వెళ్లిపోవడంతో భారత్ తీవ ఇబ్బందుల్లో పడింది. 40 నిమిషాల వరకు పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ ఆడింది. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అమిత్ రోహిదాస్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించినట్టు

Written By: Anabothula Bhaskar, Updated On : August 5, 2024 12:26 pm
Follow us on

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అద్భుతమైన విజయాలు సాధిస్తూ సరికొత్త అధ్యాయాలను లిఖిస్తోంది. ఇదే సమయంలో కీలకమైన మ్యాచ్ లలో దుమ్ము రేపుతోంది. దీంతో మెడల్ పై అభిమానుల్లో ఆశలు రేకెత్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం గ్రేట్ బ్రిటన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో టీమిండియా దుమ్మురేపింది. షూట్ అవుట్ లో విజయం సాధించి.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే గ్రేట్ బ్రిటన్ కు దీటుగా భారత జట్టు అటాకింగ్ గేమ్ ఆడింది. ఫలితంగా మ్యాచ్ ముగిసే సమయానికి రెండు జట్లు 1-1 గోల్స్ తో సమానంగా నిలిచాయి. ఫలితంగా పెనాల్టీ షూట్ అవుట్ అనేది అనివార్యమైపోయింది.. అయితే ఇందులో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చాలా సంవత్సరాల తర్వాత సెమీస్ వెళ్ళిపోయింది. సెమీస్ వెళ్లిన భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది..

గ్రేట్ బ్రిటన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్ అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్డ్ జారీ చేయడం సంచలనగా మారింది. అతడు మైదానం నుంచి బయటికి వెళ్లిపోవడంతో భారత్ తీవ ఇబ్బందుల్లో పడింది. 40 నిమిషాల వరకు పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ ఆడింది. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అమిత్ రోహిదాస్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఫలితంగా కీలకమైన సెమీస్ మ్యాచ్ లో అమిత్ రోహిదాస్ ఆడేది అనుమానంగానే ఉంది. అతడు సెమీ ఫైనల్ మ్యాచ్ కు దూరం కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆవేదన చెందుతున్నారు.

గ్రేట్ బ్రిటన్ పై మ్యాచ్ అనంతరం భారత హాకీ సమాఖ్య సంచలన ఆరోపణలు చేసింది. అంశాల వారీగా కీలకమైన ఆధారాలు బయట పెడుతూ.. మ్యాచ్ జరిగిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీల నిర్ణయాలను తీవ్రంగా తప్పు పట్టింది. రోహిదాస్ పై నిషేధం విధించడాన్ని భారత హాకీ సమాఖ్య సరికాదని పేర్కొంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్ళింది. అయితే సోమవారం రోహిదాస్ సస్పెన్షన్ పై అంతర్జాతీయ హాకీ సమాఖ్య విచారణ నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

గ్రేట్ బ్రిటన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో రోహిదాస్ కు మ్యాచ్ రిఫరీలు రెడ్ కార్డు ఇష్యూ చేశారు. ఆట 17వ నిమిషంలో రోహిదాస్ బంతితో పాటు వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వెనుకవైపు నుంచి గ్రేట్ బ్రిటన్ ఆటగాడు కల్నన్ అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో రోహిదాస్ స్టిక్ ఇరుక్కుపోయింది. అది దురదృష్టవశాత్తు కల్నన్ ముఖానికి తగిలింది. దీంతో మ్యాచ్ రిఫరీల మధ్య ఎడతెగని చర్చ సాగింది. అనంతరం రిఫరీ అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్ట్ ఇష్యూ చేశారు. ఫలితంగా భారత జట్టు పదిమంది ఆటగాళ్లతోనే 40 నిమిషాల పాటు మ్యాచ్ డిపెండ్ చేసింది. గ్రేట్ బ్రిటన్ ఆటగాళ్లను ఎక్కడికి అక్కడే నిలువరించింది. ఒకానొక దశలో గోల్ కీపర్ శ్రీజేష్ గోల్ పోస్ట్ ఎదుట అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో గ్రేట్ బ్రిటన్ జట్టు గోల్స్ చేయలేకపోయింది. కీలక ఆటగాళ్లు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.