Devara Movie : దేవర సినిమా ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్

Devara Movie : ఇక కొరటాల శివ ఈ సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారడం పక్క అంటూ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా చెప్తుండటం విశేషం...

Written By: NARESH, Updated On : June 18, 2024 7:57 am

Devara

Follow us on

Devara movie : నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా తోనే ఒక భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఆది, సింహాద్రి లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మాస్ హీరోగా అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా మరొకసారి ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఆయన సోలోగా ఒక సినిమా కూడా చేయలేదు.

కాబట్టి ఈ సినిమాతోనే తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ లేకుండా కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా కోసం ఎంతలా అయిన కష్టపడటానికి రెడీగా ఉన్నానని ఎప్పుడూ చెప్పే ఎన్టీఆర్ దేవర సినిమాతో మరోసారి తన వర్క్ డెడికేషన్ ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా నుంచి మొదటి ట్రైలర్ ని జులై మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి పది రోజుల ముందు రిలీజ్ ట్రైలర్ గా మరొక ట్రైలర్ ను వదిలే ఆలోచనలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కొరటాల శివ ఈ సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారడం పక్క అంటూ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా చెప్తుండటం విశేషం…