Vikram 2 : విక్రమ్ 2 లో కనిపించనున్న స్టార్ హీరోయిన్…

Vikram 2 ఇక మార్కెట్ పరంగా చూసుకున్న గ్లామర్ పరంగా చూసుకున్న శృతి హాసన్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే తనని ఈ సినిమాలో ఆడ్ చేయాలని లోకేష్ కనకరాజ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది...

Written By: NARESH, Updated On : June 17, 2024 10:32 pm

Shruti Haasan is the star heroine who will be seen in Vikram 2

Follow us on

Vikram 2 : కమలహాసన్ దాదాపు పది సంవత్సరాల తర్వాత విక్రమ్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకున్నాడు. లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా కమలహాసన్ ను మరోసారి స్టార్ హీరోని చేసింది. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో కమలహాసన్ మరికొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఇక అందులో భాగంగానే లోకేష్ కనకరాజ్ తోనే విక్రమ్ సినిమాకి సీక్వల్ గా విక్రమ్ 2 అనే సినిమాని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజు ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన విక్రమ్ 2 ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈలోపు కమలహాసన్ కూడా తను ఒప్పుకున్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసి తను కూడా ఫ్రీ అవ్వనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్ 2 సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ కూడా నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆమె ఎవరు అంటే కమలహాసన్ కూతురు అయిన శృతిహాసన్.. అవును ఈ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట ఇక సలార్ సినిమాతో శృతిహాసన్ పాన్ ఇండియా లో ఒక సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక దాంతో తనకు మళ్ళీ మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

కాబట్టి తనని ఈ సినిమాలో తీసుకోవాలని లోకేష్ కనకరాజు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కమలహాసన్ కూడా తన కూతురు తన సినిమాలో నటిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని లోకేష్ తో వ్యక్తం చేశారట. ఇక మార్కెట్ పరంగా చూసుకున్న గ్లామర్ పరంగా చూసుకున్న శృతి హాసన్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే తనని ఈ సినిమాలో ఆడ్ చేయాలని లోకేష్ కనకరాజ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది…