Horoscope Today: త్రిగ్రాహి యోగం కారణంగా ఈ 5 రాశుల వ్యాపారులకు లాభాలే లాభాలు..

Horoscope Today: 2024 జూన్ 18 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో త్రిగ్రాహి యోగం కారణంగా 5 రాశుల వారికి మహర్దశ కలగనుంది.

Written By: Srinivas, Updated On : June 18, 2024 7:58 am

horoscope trigrahi

Follow us on

Horoscope Today: 2024 జూన్ 18 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో త్రిగ్రాహి యోగం కారణంగా 5 రాశుల వారికి మహర్దశ కలగనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కటుంబ సభ్యుుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. సాయత్రం ఉల్లాసంగా ఉంటారు.

వృషభ రాశి:
ఆర్థిక లావాదేవాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు తోటివారితో సంయమనం పాటించాలి.

మిథున రాశి:
వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. కుటుంబ సభ్యుల నుంచి ఆదాయం పొందుతారు.

కర్కాటక రాశి:
ఉద్యోగులు తీసుకునే కొన్ని నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

సింహారాశి:
స్నేహితులతో కొన్ని సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలపై జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:
కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆద్యాత్మిక కార్యక్రమాలపై శ్రద్ధ చూపుతారు. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటారు.

తుల రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థుల కెరీర్ పై నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.

వృశ్చిక రాశి:
కుటుంబ సభ్యుల్లో అపార్థాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉండే అవకాశం.ఇంటికి అతిథుల రాక పెరుగుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు రాశి:
వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి. దూరపు ప్రయాణాలు ఉండే అవకాశం. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది.

మకర రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థికంగా బలపడుతారు. ఖర్చులను నియంత్రించాలి. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు.

కుంభరాశి:
కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణంలో ఉంటారు. కొన్ని పనుల నిమిత్తం ఆదాయం పెరుగుతుంది. పొదుపు పథకాల్లో డబ్బులు సేవ్ చేస్తారు.

మీనరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. రాజకీయ నాయకుల వారికి ఇతరుల మద్దతు ఉంటుంది.