Homeక్రీడలుOdi World Cup 2023 India: వన్డే వరల్డ్ కప్ జట్టు మెంటార్ గా ఆ...

Odi World Cup 2023 India: వన్డే వరల్డ్ కప్ జట్టు మెంటార్ గా ఆ లెజండ్ క్రికెటర్.. ఇక భారత జట్టుకు తిరుగు లేనట్టే..!

Odi World Cup 2023 India: భారత్ వేదికగా ఈ ఏడాది చివరలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ ను భారత జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఐసీసీ నిర్వహించే టోర్నీలనూ భారత జట్టు గెలిచి సుమారు 10 ఏళ్లు కావస్తోంది. చివరిసారిగా మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీను భారత జట్టు గెలిచింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క మేజర్ టోర్నీని కూడా భారత జట్టు గెలవలేకపోయింది. దీంతో ఈ ఏడాది భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ పై అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సొంత మైదానాల్లో ఆడుతుండడం భారత జట్టుకు కలిసి వస్తుందని అభిమానులతో పాటు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు బలాన్ని చేకూర్చే మరో నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకోబోతోంది.

వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్పుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. సొంత దేశంలో, సొంత మైదానాల్లో భారత జట్టు ఆడుతుండడం కలిసి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వదేశంలో భారత జట్టు ఎప్పుడూ బలమైనది గానే ఉంటుంది. భారతదేశానికి వచ్చి భారత జట్టును ఓడించడం ప్రత్యర్ధులకు అంత సులభం కాదు. కాబట్టి ఈ వన్డే వరల్డ్ కప్ కు భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ ఒక వైపు భారత జట్టుకు సానుకూల అంశాలుగా కనిపిస్తుంటే మరోవైపు బీసీసీఐ మరింత బలాన్ని జట్టుకు చేకూర్చే నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. అదే వన్డే వరల్డ్ కప్ జట్టుకు మెంటార్ గా భారత జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా పేరుగాంచిన మహేంద్రసింగ్ ధోనిని నియమించబోతున్నారు. ఇది భారత జట్టుకు బలాన్ని చేకూరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మెంటార్ గా ధోని.. భారత జట్టుకు బలం..

మహేంద్రసింగ్ ధోని జట్టులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు ఉండదు. సొంత జట్టుకు కొండంత బలంగా ఉంటాడు ధోని. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లకు ముకుతాడు వేయడంలో ధోనీకి మించిన వారు మరొకరు ఉండరు. అందుకే భారత క్రికెట్ లో మరో కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో గొప్ప విజయాలను అందించి పెట్టాడు. టి20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ఐసీసీ నిర్వహించే మూడు ట్రోఫీలను తన సారధ్యంలో భారతదేశానికి అందించి పెట్టాడు ధోని. అలాగే టెస్టుల్లోనూ, వన్డేల్లో, టి20 లోను గొప్ప విజయాలను తన సారధ్యంలో నమోదు చేశాడు. విదేశాల్లోనూ బలమైన జట్లను ఓడించి తనకంటూ ఒక రికార్డును సృష్టించుకుని వెళ్ళాడు మహేంద్రసింగ్ ధోని. ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అభిమానుల్లో ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ కు వేలాదిమంది ధోని అభిమానులు తరలివచ్చి చెన్నై జట్టును ప్రోత్సహించారు. వారి అంచనాలను వమ్ము చేయకుండా చెన్నై జట్టు గొప్ప విజయాలతో ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీను అందుకుంది. దీంతో ఐదు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్న సారధిగా ధోని మరో రికార్డును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ధోనీకి, ధోని అభిమానులకు సంతోషాన్ని కలిగించే మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అదే వన్డే వరల్డ్ కప్ ఆడునున్న భారత జట్టుకు మెంటారుగా ధోనీని బీసీసీఐ నియమించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే భారత జట్టు మరింత బలంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్..

ధోని జట్టులో ఉంటే కొండంత బలం. అదే జట్టుతో ఉంటే మరింత బలం ఆటగాళ్లకు లభిస్తుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో ఉండే అవకాశం పోయింది. దీంతో వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టుతో ధోని ఉండేలా బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మెంటార్ గా ధోని నియమించడం ద్వారా అతని సలహాలను, సూచనలను, అనుభవాన్ని జట్టుకు ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ధోని జట్టుతో ఉండడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆడునున్న ఇతర దేశాలకు సంబంధించిన ఆటగాళ్లు ఎలా ఆడతారు, వారిని ఎలా కట్టడి చేయాలి వంటి ప్రణాళికలు ధోని వద్ద ఇప్పటికే ఉండి ఉంటాయి. వాటికి మరింత పదులు పెట్టి వన్డే వరల్డ్ కప్ లో వినియోగించుకోవడం ద్వారా ప్రత్యర్థి జట్లకు చెప్పాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే మెంటార్ గా ధోనీ నియామకం జరగనుంది. ఇక ధోనీకి అండగా ఉండే లక్కు కూడా కలిసి వస్తే ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కూడా భారత జట్టు సొంతం అయ్యే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular