Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని ఇప్పుడు విడుదలకు సిద్ధం గా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 28 వ తారీఖున ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. విడుదలకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రాకపోవడం పై ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తమ ఫ్రస్ట్రేషన్ ని వ్యక్తపరుస్తున్నారు.
ఈ వారం లో టీజర్ ని విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర కొనసాగుతూ ఉండడం వల్ల వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. అదేమిటంటే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ కామెడీ టైమింగ్ ని మరోసారి బయటపెట్టాడట. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంత ఎనర్జీ తో కనిపిస్తాడో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనని నచ్చనోళ్లు ఉండరు, చాలా సహజంగా ఉంటుంది.
సినిమాల కంటెంట్ పెద్దగా లేకపోయినా పవన్ కళ్యాణ్ తన కామెడీ టైమింగ్ తో మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. కానీ ‘బ్రో ‘ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి కామెడీ టైమింగ్ తో పాటుగా అద్భుతమైన కంటెంట్ కూడా తోడు అయ్యిందని,ప్రస్తుతం ఈ చిత్రం పై అంచనాలు లేవని అభిమానులు బాధపడుతున్నారు కానీ, ఒక్కసారి టీజర్ వచ్చిన తర్వాత లెక్కలు మారుతాయని అంటున్నారు, చూడాలి మరి.