Aparichitudu: సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ చిత్రాలలో ఒకటి శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ చిత్రం. ఈ సినిమా ఆరోజుల్లో అటు తమిళ ఇండస్ట్రీ ని ఇటు తెలుగు ఇండస్ట్రీ నో ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో అప్పట్లో ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది, మొదటి వారం రోజులు అసలు వసూళ్లే లేవు.
కానీ చాప క్రింద నీరు లాగ చిన్నగా పాజిటివ్ టాక్ వ్యాప్తి చెంది వసూళ్ల పరంగా ఆరోజుల్లోనే ఈ సినిమా తెలుగులో 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం లో హీరో గా నటించిన విక్రమ్ కి మామూలు క్రేజ్ రాలేదు. ముఖ్యంగా ఆయన నటనకి సౌత్ మొత్తం ఫిదా అయ్యింది. కమల్ హాసన్ తర్వాత సౌత్ లో అంత గొప్ప నటుడు విక్రమ్ అని చెప్పుకొచ్చారు విశ్లేషకులు.
అయితే ఈ సినిమాని తొలుత విక్రమ్ తో చెయ్యాలని అనుకోలేదట, కమల్ హాసన్ తో చేద్దాం అని అనుకున్నాడట డైరెక్టర్ శంకర్. కానీ ఆయన ఏ మూడ్ లో స్టోరీ విన్నాడో తెలియదు కానీ, ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక ఈ సినిమాని ఎవరితో చేద్దాం అనే సందిగ్ధం లో ఉన్నప్పుడు విక్రమ్ హీరో గా నటించిన ‘శివపుత్రుడు’ సినిమాని చూశాడట శంకర్.
ఈ సినిమాలో ఆయన నటన ని చూసి మరోమారు ఆలోచించకుండా వెంటనే విక్రమ్ ని కలిసి ఈ సినిమా కథని వినిపించి ఓకే చేయించుకున్నాడట. ఆరోజుల్లోనే ఈ సినిమా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ మరియు 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది అట. ఇప్పుడు శంకర్ ఇదే చిత్రాన్ని హిందీ లో రణబీర్ కపూర్ తో రీమేక్ చెయ్యబోతున్నాడు, అక్కడ కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.