Viral Video: ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, గుగ్లీ, దుస్రా.. ఇంకా ఏమైనా ఉంటే అవి.. స్పిన్ బౌలింగ్ గురించి చర్చ వచ్చినపుడు ఈ పదాలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి.. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అజంతా మెండీస్ వంటి వారు స్పిన్ బౌలింగ్ లో సరికొత్త రికార్డులు సృష్టించారు. బంతిని చిత్ర విచిత్రమైన మెలికలు తిప్పుతూ ప్రఖ్యాత బ్యాట్స్మెన్ ను బోల్తా కొట్టించారు. అయితే ఇలాంటి బౌలర్లు కూడా బౌలింగ్లో అది కూడా స్పిన్ బౌలింగ్లో కొత్త పాఠాలు నేర్చుకోవాలేమో.. ఎందుకంటే అలా ఉంది మరి అతడి బౌలింగ్.
కేసీసీ టి20 ఛాలెంజర్స్ కప్ 2024 లో భాగంగా కువైట్ నేషనల్స్, ఎస్బీఎస్సీ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా ఓ స్పిన్ బౌలర్ వేసిన బంతి అనూహ్య మలుపులు తిరిగింది. తిరిగింది అనేదానికంటే భూచక్రాన్ని మించిపోయింది అనడం సబబు. వైట్ ఆటగాడు ఫ్లైటేడ్ డెలివరీ వేశాడు. వాస్తవానికి ఇలాంటి డెలివరీని భారత స్పిన్ దిగ్గజం హార్భజన్ సింగ్ వేసేవాడు.. సరిగా అలాంటి డెలివరీని కువైట్ ఆటగాడు వేశాడు. అయితే ఆ బంతి ని వికెట్ల మీదుగా ఆడేందుకు బ్యాటర్ ప్రయత్నించాడు. ఊహించని విధంగా అది టర్న్ అయి వికెట్లను గిరాటేసింది.
బంతిని బలంగా కొడదామని అనుకున్న బ్యాటర్ బియాంత్.. బాల్ టర్న్ అయిన విధానాన్ని చూసి ఒక్కసారిగా బిత్తర పోయాడు. ఇదెక్కడి బంతి రా బాబూ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ బంతి వికెట్లను గిరాటేసిన విధానం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది… ఈ వీడియోలో ఆ బంతి వికెట్లను పడగొట్టిన తీరు చూసి నెటిజన్లు బాల్ ఆఫ్ ది సెంచరీ అని కొనియాడుతున్నారు. అది కాదు భయ్యో.. భూచక్రమై ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
నెటిజన్లు మాత్రమే కాదు పేరు పొందిన ఆటగాళ్లు కూడా ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు..సౌత్ ఆఫ్రికా జట్టుకు చెందిన స్పిన్నర్ టబ్రైజ్ షంసీ సైతం ఈ వీడియో చూసి ఫిదా అవుతున్నాడు. ” మేం కూడా ఇలాంటి బౌలింగ్ వేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తాం” అని కేశవ్ మహారాజ్ ను ట్యాగ్ చేశాడు.
షంసీ, కేశవ్ మహరాజ్ ఆదివారం సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ ఆడారు. షంసీ పార్ల్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించారు. మహరాజ్ డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగారు. కాగా, ఆదివారం పైనల్ మ్యాచ్ జరగగా.. డర్బన్ జెయింట్స్ పై సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు విజయం సాధించి వరుసగా రెండో టైటిల్ దక్కించుకుంది. ఈ విజయం తో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు యజమాని కావ్య మారన్ ఎగిరి గంతేసింది.
We’ve gotta work on this ball next @keshavmaharaj16 https://t.co/GiUcorbg3l
— Tabraiz Shamsi (@shamsi90) February 11, 2024