Ind W Vs Wi W 3rd Odi: ఇప్పటికే మొదటి, రెండు వన్డేలలో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది.. రెండు మ్యాచ్ ల లోనూ భారత ప్లేయర్లు అదరగొట్టారు. బ్యాటింగ్లో దుమ్మురేపారు. బౌలింగ్లో సత్తా చాటారు. ఫలితంగా భారత్ వరస విజయాలు సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ఎదురు అయిన దారుణమైన పరాభవాన్ని ఈ విజయం ద్వారా టీం ఇండియా భర్తీ చేసింది.. ఆస్ట్రేలియాతో సిరీస్ పూర్తయిన తర్వాత.. భారత మహిళల జట్టు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ ఆడటం మొదలుపెట్టింది. అయితే టీమిండియా వెస్టిండీస్ జట్టును గెలుస్తుందా? గట్టి పోటీ ఇస్తుందా? అని అందరు అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. బ్యాటింగ్లో సంచలనం సృష్టించారు. బౌలింగ్లో అద్భుతాలు చేశారు. ముఖ్యంగా రెండవ వన్డేలో భారీ స్కోరు సాధించారు. వన్డేల లోనే హైయెస్ట్ స్కోర్ రికార్డుకు సమానంగా వచ్చారు. గతంలో ఐర్లాండ్ జట్టుపై చేసిన స్కోరుకు సమానంగా పరుగులు చేశారు. ఇంకో ఓవర్ గనుక ఉండి ఉంటే భారత్ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ సెట్ చేసేది. రెండవ వన్డేలో హర్లిన్ డియోల్ సూపర్ సెంచరీ చేసి అదరగొట్టింది.. వన్డేలో తొలి సెంచరీ చేసి ఆరుదైన ఘనతను అందుకుంది.
మూడవ వన్డే లోనూ..
మూడవ వన్డే లోనూ భారత జట్టు అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి 38.5 ఓవర్లలోనే 162 పరుగులకు కుప్పకూలింది. వెస్టిండీస్ జట్టులో హెన్రీ 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. క్యాంప్ బెల్ 46 రన్స్ తో ఆకట్టుకుంది. దీప్తి ఆరు వికెట్లు సాధించింది. రేణుక నాలుగు వికెట్లు పడగొట్టింది. అయితే ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 28.2 ఓవర్లలోనే చేదించింది. దీప్తి 39*, రిచా 23* పరుగులతో ఆకట్టుకున్నారు. మూడవ వన్డేలోనూ విజయం సాధించడం ద్వారా.. టీమ్ ఇండియా సిరీస్ ను వైట్ వాష్ చేసింది. భారత గడ్డపై వెస్టిండీస్ జట్టుకు కోలుకోలేని ఓటమిని అందించింది. వన్డే సిరీస్ గెలవడం ద్వారా.. ఈ ఏడాదిని విజయంతో భారత మహిళల జట్టు ముగించింది.. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో భారత్ దారుణమైన పరాజయాన్ని మూటకటుకుంది.. దీంతో భారత ప్లేయర్లపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఆ ఓటమిని మరిపిస్తూ టీమ్ ఇండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. వెస్టిండీస్ జట్టు పై అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేశారు. వెస్టిండీస్ జట్టుకు దారుణమైన ఓటమిని మిగిల్చారు. ఈ గెలుపు ద్వారా టీమ్ ఇండియా ప్లేయర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వెస్టిండీస్ జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 3 వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఈ ఏడాదిని విజయంతో ముగించింది. #teamIndiaw pic.twitter.com/lNIo1Fh9MI
— Anabothula Bhaskar (@AnabothulaB) December 27, 2024