https://oktelugu.com/

T20 Women’s World Cup : ఆస్ట్రేలియాతో మరికొద్ది గంటల్లో కీలక మ్యాచ్.. సచిన్ నామస్మరణ చేస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ సేన.. ఎందుకంటే?

దుబాయ్ వేదికగా టి20 మహిళల ప్రపంచ కప్ జరుగుతోంది. సెమీఫైనల్ ముందు నేపథ్యంలో భారత జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ఆస్ట్రేలియా పై ఆడనుంది. షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సెమీస్ వెళ్లాలంటే భారత జట్టు కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 13, 2024 7:32 pm
T20 Women's World Cup

T20 Women's World Cup

Follow us on

T20 Women’s World Cup:  హర్మన్ ప్రీత్ కౌర్ సేనకు ఎలాంటి పరిస్థితులయితే ఎదురయ్యాయో.. గతంలో భారత పురుషుల జట్టుకు కూడా ఇలాంటి సవాల్ ఎదురైంది. అప్పుడు కూడా భారత్, ఆస్ట్రేలియా జట్లు ప్రత్యర్థులుగా ఉన్నాయి. నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ఫైనల్ వెళ్ళింది. ట్రోఫీ దక్కించుకుంది. ఇప్పుడు కూడా అదే మైదానంలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో తలపడుతుంది.. ఈ క్రమంలో నాడు సచిన్ టెండూల్కర్ ఆడిన ఆట తీరు నుంచి హర్మన్ సేన స్ఫూర్తి పొందుతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే

1998 ఏప్రిల్ 22న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా కోకో కోలా కప్ ట్రై సిరీస్ జరిగింది. ఆ సిరీస్ లో భారత్ – ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 283 రన్స్ చేసింది. దీంతో భారత్ ఎదుట 284 టార్గెట్ ఉంచింది. అసలే ఎడారి దేశం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్ 40 డిగ్రీస్ పైనే ఉంది. ఈ క్రమంలో ఇసుక తుఫాన్ చెలరేగింది. ఆటకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. దాదాపు 25 మినిట్స్ తర్వాత ఆట మొదలైంది. వాతావరణం లో చోటు చేసుకున్న మార్పుల దృష్ట్యా అంపైర్లు టీమ్ ఇండియా టార్గెట్ 46 ఓవర్లలో 276 రన్స్ గా నిర్ణయించారు. అప్పుడు బ్యాటింగ్ కు దిగాడు 24 ఏళ్ల సచిన్ టెండుల్కర్. అద్భుతమైన ఆడతీరుతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 131 బంతుల్లో 9 ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 143 రన్స్ చేశాడు. అద్భుతమైన టెక్నిక్ తో ఆస్ట్రేలియా బౌలర్లను బెంబేలెత్తించాడు.

ట్రోఫీ దక్కించుకుంది

ఆస్ట్రేలియాపై సచిన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. భారత్ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ సచిన్ భీకరమైన ఇన్నింగ్స్ వల్ల అద్భుతమైన నెట్ రన్ రేట్ ను సాధించింది. సెమీస్ బరిలో నిలిచిన న్యూజిలాండ్ జట్టును పక్కకి నెట్టి ఫైనల్ వెళ్ళింది. ఆ తర్వాత ఏప్రిల్ 24 1998 సచిన్ పుట్టినరోజు సందర్భంగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఆ మ్యాచ్లో సచిన్ 131 బంతులు ఎదుర్కొని 134 రన్స్ చేశాడు. నీతో భారత్ ఆర్ వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై విజయం సాధించి.. ట్రోఫీ దక్కించుకుంది. సచిన్ ఆస్ట్రేలియాపై ఆడిన ఈ రెండు ఇన్నింగ్స్ లు ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ లు గా పేరుపొందాయి. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు సైతం సచిన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ల నుంచి స్ఫూర్తి పొందారంటే అతిశయోక్తి కాదు. నాడు ఆస్ట్రేలియా – భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరిగింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లోను న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా- టీమిండియా ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హర్మన్ సేన నాడు సచిన్ టెండుల్కర్ ఆడిన ఇన్నింగ్స్ ను పదేపదే చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ నామస్మరణతో గెలవాలని టీమిండియా ప్లేయర్లు భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.