https://oktelugu.com/

Vishwam Collections : విశ్వం’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కొన్ని మాస్ ప్రాంతాలలో స్టార్ హీరో రేంజ్ వసూళ్లు..గోపీచంద్ ట్రాక్ లో పడినట్టే!

విశ్వం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు మాత్రం అంతకు రెండింతలు వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, దసరా పండుగ ఈ సినిమాకి ఎంతలా కలిసి వచ్చింది అనేది. అలా రెండు రోజుల్లో దాదాపుగా 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 07:39 PM IST

    Vishwam Collections

    Follow us on

    Vishwam Collections :  చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్, ఇటీవలే శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం చిత్రం ద్వారా మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హీరో ఫ్లాప్స్ లో ఉన్నాడు, డైరెక్టర్ కూడా ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇలా ఇద్దరూ ఫ్లాప్స్ లో ఉండడంతో ఈ చిత్రం పై అసలు ఏమాత్రం హైప్ ఏర్పడలేదు. కానీ మొదటి రోజు కాస్త పాజిటివ్ టాక్ రాగానే చిన్నగా పికప్ అయ్యింది. ‘దసరా’ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. ప్రతీ సెంటర్ లో ఈ చిత్రం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి పోటీ ఇచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. అనేక ప్రాంతాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రాన్ని కూడా డామినేట్ చేసి సంచలనం సృష్టించింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు కలిపి 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

    మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు మాత్రం అంతకు రెండింతలు వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, దసరా పండుగ ఈ సినిమాకి ఎంతలా కలిసి వచ్చింది అనేది. అలా రెండు రోజుల్లో దాదాపుగా 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా మేకర్స్ మాత్రం పోస్టర్స్ లో మొదటి రోజే బయ్యర్స్ కి లాభాలు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మీద కూడా ట్రేడ్ లో సరైన సమాచారం లేదు. చాలా మంది ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగిందని అంటారు. కొన్ని వర్గాలు మాత్రం ఏకంగా 14 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది అని చెప్పుకొచ్చారు. బుర్ర ఉన్న ఏ బయ్యర్ కూడా ఈ సినిమాకి 14 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయరు. ఎందుకంటే డైరెక్టర్ కి సూపర్ హిట్ తగిలి చాలా కాలం అయ్యింది.

    ఇక హీరో గోపీచంద్ అయితే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని పూర్తిగా కోల్పోయే స్థితికి వచ్చేసాడు. అలాగే నిర్మాత విశ్వప్రసాద్ వరుసగా ‘మనమే’, ‘మిస్టర్ బచ్చన్’ వంటి దారుణమైన డిజ్జాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇలాంటి చెత్త రికార్డ్స్ ఉన్న కాంబినేషన్ కలిసి సినిమా చేస్తే ఎవరికీ మాత్రం ఆసక్తి ఉంటుంది చెప్పండి?, 14 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనేది ముమ్మాటికీ అబద్దపు ప్రచారమే. 5 కోట్ల రూపాయలకు జరిగింది అనేది వాస్తవం. నిన్నటితో 70 శాతం రికవరీ ని సాధించిన ఈ చిత్రం, నేటితో 90 శాతం కి చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.