ఐపీఎల్ ఆడిన ఆస్ర్టేలియన్ల కష్టాలు, కన్నీళ్లివీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో 14వ ఎడిషన్ లో ఆడిన ఆస్ర్టేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇంటికి చేరారు. ఐపీఎల్ అర్థంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడు లేని విధంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను డేవిడ్ వార్నర్, స్టీవ్, స్మిత్, పాటి కమి్మన్స్, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రసవత్తరంగా సాగుతోన్న ఐపీఎల్2021 సీజన్ పై కరోనా వైరస్ […]

Written By: Srinivas, Updated On : May 31, 2021 5:46 pm
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో 14వ ఎడిషన్ లో ఆడిన ఆస్ర్టేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇంటికి చేరారు. ఐపీఎల్ అర్థంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడు లేని విధంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను డేవిడ్ వార్నర్, స్టీవ్, స్మిత్, పాటి కమి్మన్స్, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

రసవత్తరంగా సాగుతోన్న ఐపీఎల్2021 సీజన్ పై కరోనా వైరస్ పంజా విసిరిన విషయం తెలిసిందే. వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ సహా కొందరు క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇస్తున్న నగరాలు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కత్తాల్లో పె ద్ద ఎత్తున రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మే నెల 4న టోర్నమెంట్ అర్థంతరంగా రద్దు చేసింది.

ఆస్ర్టేలియా క్రికెటర్లకు మాత్రం ఆ చాన్స్ దక్కలేదు. కరోనా వైరస్ కేసుల తీవ్రత నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం భారత్ నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించింది. భారత్ లో వాయు మార్గాన్ని మూసివేసింది. విమాన సర్వీసులను నిలిపివేసింది. ఐపీఎల్ ఆడుతోన్న ఆ దేశ క్రికెటర్లు సొంత గడ్డపై అడుగు పెట్టాలంటే మూడు వారాల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందనే నిబంధన విధించింది. దీంతో ఆసీస్ క్రికె టర్లు, సపోర్టింగ్ స్టాప్ అంతా క్వారంటైన్ లోకి వెళ్లారు.

ఆస్ర్టేలియాకు చేరిన తరువాత కూడా ఇంటికి వెళ్లే అవకాశం లేకపోయింది. నిబంధనల ప్రకారం అక్కడ కూడా మూడు రోజుల పాటు క్వారంటైన్ లో గడిపారు. దాన్ని కూడా ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. సాధారణంగా క్రికెటర్లు ఏఢాది పొడవునా విదేశీ పర్యటనల్లో సుదీర్ఘకాలం గడుపుతుంటారు. అది సహజమే. అయినప్పటికీ ప్రాణాంతక కరోనా వైరస్ కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా సురక్షితంగా ఇంటికి చేరడం కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురి చేసింది.