ఆనందయ్య మందుకు జైకొట్టిన హైకోర్టు

ఏపీ ప్రజలకు కరోనా రోగులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలిసిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో కేసులు ఉండడంతో ఇప్పుడు హైకోర్టు కూడా నిర్ణయం ప్రకటించింది. ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు తుది తీర్పునిచ్చింది. కంటిలో వేసే డ్రాప్స్ పై మాత్రం […]

Written By: NARESH, Updated On : May 31, 2021 5:16 pm
Follow us on

ఏపీ ప్రజలకు కరోనా రోగులకు మరో శుభవార్త అందింది. ఇప్పటికే ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలిసిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో కేసులు ఉండడంతో ఇప్పుడు హైకోర్టు కూడా నిర్ణయం ప్రకటించింది.

ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు తుది తీర్పునిచ్చింది. కంటిలో వేసే డ్రాప్స్ పై మాత్రం గురువారం లోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆనందయ్య మందుపై ఈరోజు ఉదయం, మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. కరోనాకు మందు లేకపోవడం.. ఈ ఆయుర్వేద మందు పనిచేస్తోందన్న భరోసా నేపథ్యంలో ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలుపాలని ప్రభుత్వం తరుఫు న్యాయవాదిని హైకోర్టు కోరింది.

ప్రభుత్వం సమీక్షించి ఆనందయ్య మందుకు ఓకే చెప్పడంతో హైకోర్టు కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరో దఫా విచారణ జరిపి ఆనందయ్య మందుకు అనుమతి అవసరం లేదని మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.