AFG vs BAN: షార్జా వేదికగా ఈ మూడు వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే షార్జా వేదికగా ఆరవ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది.. రెండవ వన్డే నవంబర్ 9, శనివారం మధ్యాహ్నం 3:30 నుంచి మొదలవుతుంది. మూడో వన్డే నవంబర్ 11 సోమవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో విజయం సాధించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ కంటే కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ సంచలన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నది. బంగ్లాదేశ్ ఇటీవల పాకిస్తాన్ జట్టుతో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత భారత్ లో పర్యటించింది. టెస్ట్, టి20 సిరీస్ లను కోల్పోయింది. భారత చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఇక సెప్టెంబర్ లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లలో రషీద్ ఖాన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మైదానంతో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నారు. బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. వైవిద్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు సింహ స్వప్నం లాగా మారుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లైవ్ ప్రసారం fan code, వెబ్ సైట్ లో చూడొచ్చు.
జట్ల అంచనా ఇలా
ఆఫ్ఘనిస్తాన్
హస్మతుల్లా షాహిది, రహమత్ షా, గురుబాజ్, ఇక్రమ్, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, సెడి ఖుల్లా అటల్, ధర్విష్, ఓమర్ జాయ్, మహమ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, ఫరుకి, బిలాల్ సమీ, నవీద్ జద్రన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
బంగ్లాదేశ్
సౌమ్య సర్కార్, టాన్జిద్ హసన్, నజ్ముల్, తౌహీద్ హృదయ్, మహమ్మద్ ఉల్లా మెహదీ హసన్ మిరాజ్, జఖీర్ హసన్, జాకర్ అలీ, రిషాద్, నసుం అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోద్రి ఫుల్ ఇస్లాం.
మైదానం ఎలా ఉందంటే…
షార్జా మైదానం బ్యాటింగ్ కు స్వర్గధామం. ఇదే సమయంలో బౌలింగ్ కు కూడా అనుకూలిస్తుంది. సాయంత్రమైతే వాతావరణం లో తేమ పెరుగుతుంది కాబట్టి బంతి అనూహ్యంగా టర్న్ అవుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లకు ఎక్కువగా విజయావకాశాలుంటాయి. ఒకవేళ నాణ్యమైన బ్యాటర్లు ఉంటే చేజింగ్ చేసే జట్టుకు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే షార్జా మైదానంలో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయాలు సాధించాయి. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో టాస్ కీలక భూమిక పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The first odi between afghanistan and bangladesh can be watched live on fan code and website of this series today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com