Chiranjeevi: చిరంజీవి తెలుగు సినిమాను ఏలిన నెంబర్ వన్ హీరో. దశాబ్దాలుగా ఆయన ప్రస్థానం కొనసాగుతుంది. అయితే చిరంజీవి కెరీర్లో కూడా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. ఆయన హిట్ లేక ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. 1993లో ముఠామేస్త్రి మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు. అయితే ముఠామేస్రి మూవీ అనంతరం చిరంజీవికి వరుస ప్లాప్స్ పడ్డాయి.
అదే ఏడాది ఆయన నటించిన మెకానిక్ అల్లుడు ఆడలేదు. ఈ మూవీలో ఏఎన్నార్ ఓ కీలక రోల్స్ చేయడం విశేషం. ముగ్గురు మొనగాళ్లు పర్వాలేదు అనిపించుకుంది. ట్రిపుల్ రోల్ చేసిన చిరంజీవికి పూర్తి స్థాయిలో విజయం దక్కలేదు. ఎస్పీ పరశురామ్ డిజాస్టర్ అయ్యింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన అల్లుడా మజాకా ఓ మోస్తరు విజయం అందుకుంది. కానీ ఆ మూవీ విమర్శలపాలైంది.
అత్తను రేప్ చేసిన అల్లుడిగా చిరంజీవిని ఆ మూవీలో చూపిస్తారు. మరీ వల్గర్ మూవీ అనే విమర్శలు ఎదురయ్యాయి. ఇక బిగ్ బాస్, రిక్షావోడు అయితే డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో చిరంజీవి సందిగ్ధంలో పడ్డాడు. అసలు ఎలాంటి మూవీ చేయాలని తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఆయన ఓ రీమేక్ ఎంచుకున్నాడు. డైరెక్టర్ సిద్దిఖీ మలయాళంలో తెరకెక్కించిన హిట్లర్ చిత్రాన్ని రీమేక్ చేశాడు. హిట్లర్ మలయాళంలో సూపర్ హిట్.
ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరంజీవి ఈ మూవీలో నటించాడు. రంభ హీరోయిన్. ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. ఈ మూవీ కథా చర్చలు జరుగుతుండగా… ఎడిటర్ మోహన్, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య పాల్గొన్నారట. హీరో చెల్లి ప్రేమను తిరస్కరిస్తాడనే పాయింట్ ని ఆ ఆఫీస్ లో పని చేస్తున్న బాయ్ విన్నాడట. హీరో చెల్లెలి ప్రేమను వ్యతిరేకిస్తే అతడు హీరో ఎందుకు అవుతాడు, విలన్ అవుతాడు కానీ అన్నాడట.
ఆఫీస్ బాయ్ చెప్పిన ఆ మాట ఎడిటర్ మోహన్ కి బాగా నచ్చిందట. ఆఫీస్ బాయ్ అభిప్రాయానికి అనుగుణంగా కథలో మార్పులు చేశారట. 1996లో విడుదలైన హిట్లర్ చిరంజీవికి హిట్ ఇచ్చింది. ఆయన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. హిట్లర్ చిత్రానికి కోటి ఇచ్చిన సంగీతం ప్లస్ అయ్యింది. పాటలు చాలా బాగుంటాయి. సిస్టర్ సెంటిమెంట్ సిల్వర్ స్క్రీన్ పై వర్క్ అవుట్ అయ్యింది.
ఆ విధంగా చిరంజీవి మరలా నిలదొక్కుకున్నాడు. హిట్లర్ మూవీలో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ, సుధాకర్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక రోల్స్ చేశారు. హిట్లర్ మూవీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.