Homeక్రీడలుChess World Cup 2023: పోటీ…నీదా.. నాదా ..సై అంటున్న ప్రజ్ఞానంద్, కార్ల్ సన్.. గెలుపెవరిది?

Chess World Cup 2023: పోటీ…నీదా.. నాదా ..సై అంటున్న ప్రజ్ఞానంద్, కార్ల్ సన్.. గెలుపెవరిది?

Chess World Cup 2023: పోటీ ఒకవైపు 18 ఏళ్ల వయసులో ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న ప్రజ్ఞానంద్…మరోవైపు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న ఫస్ట్ క్లాస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ ఇద్దరి మధ్య ఊరిలో విజేత ఎవరో? ప్రపంచ కప్ కిరీటాన్ని కైవసం చేసుకునేది ఎవరో? ఈరోజుతో తేలిపోతుంది. ఇద్దరి మధ్య సాగుతున్న ఫైనల్ సమరంలో వరుసగా రెండో గేమ్ కూడా డ్రా అయింది. దీంతో ఇద్దరి మధ్య పోరు
టైబ్రేక్ దిశగా మళ్ళింది. బ్లిట్జ్ ఫార్మాట్లో సాగే టైబ్రేక్ లో కార్ల్సన్ కు ప్రజ్ఞానంద చెక్ మేట్ చెప్పాలి అన్నది భారత్ అభిమానుల యొక్క ఆకాంక్ష.

ఇద్దరి మధ్య సాగిన రెండు గేమ్స్ డ్రా గా ముగియడంతో జరగబోయే మ్యాచ్ మరింత జటిలంగా మారింది. ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా కార్ల్సన్ తన పావులను డిఫెన్స్ దిశగానే కదపాడు…ఎంతో జాగ్రత్తగా డ్రా దృష్టిలో పెట్టుకొని అతని ఎత్తులు ఉన్నాయి. మరోపక్క ప్రజ్ఞానంది కూడా ఎటువంటి పొరపాటుకు ఆస్కారం ఇవ్వకుండా తన పావులను ఎంతో చాకచక్యంగా కదిపాడు.. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ కార్ల్సన్ ఆట తెల్లపావులతో సాగితే ప్రజ్ఞాన నల్లపావులను వాడాడు.

సెమీస్ తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇబ్బంది పడినట్లు తెలియచేసిన కార్ల్సన్.. ఎంతో వ్యూహాత్మకంగా పోరును టైబ్రేకు వైపు మళ్ళించడానికి ఎత్తులు వేశాడు. ఒక్కరోజు ఆగితే అతను మరింత శక్తి పుంజుకొని పూర్తిస్థాయిలో తలపడే అవకాశం ఉంటుంది అనేది అతని ఆలోచన. ఇటు ప్రజ్ఞానంది కూడా మంచి డిఫెన్స్ గేమ్ ఆడాడు. దీంతో 30 ఎత్తులు పూర్తి అయ్యేసరికి పాయింట్స్ పంచుకోవడానికి ఆటగాళ్లు ఇద్దరు ఓకే చెప్పారు.

రెండు క్లాసికల్ గేమ్స్ పూర్తి అయిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్సన్ 1-1 స్కోర్ తో సమానంగా ఉన్నారు. ఇప్పుడు విజేత ఎవరు అనేది తేల్చే టైబ్రేక్ పై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ గేమ్ గురువారం నాడు జరగనుంది. నాకౌట్ ఫార్మాట్లో జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ కప్ పోటీలో ప్రతి రౌండ్ లోను రెండు క్లాసికల్ గేమ్స్ నిర్వహిస్తారు. ఇది పూర్తి అయిన తర్వాత కూడా విన్నర్ ఎవరు అనేది తేలేకపోతే…టైబ్రేక్ తప్పనిసరిగా మారుతుంది.ఈ టైబ్రేక్ లో ఫస్ట్ రాపిడ్ పోటీ నిర్వహిస్తారు. రౌండ్ కి రెండు గేమ్ల చొప్పున రెండు రౌండ్ల పోటీ జరుగుతుంది. మొదటి రౌండ్లో ఫలితం వస్తే ఇక పోటీ అక్కడితో ఆపేసి విజేతను డిక్లేర్ చేస్తారు. అలాకాకుండా రాపిడ్ రౌండ్ పూర్తి అయిన తర్వాత కూడా ప్లేయర్స్ పాయింట్స్ ఈక్వల్ గా ఉంటే.. అప్పుడు రౌండ్ కి రెండు చొప్పున బ్లిట్జ్ గేమ్లు నిర్వహిస్తారు. ఇలా విజేత ఎవరు అనేది తేలేంతవరకు బ్లిట్జ్ గేమ్లు కొనసాగిస్తారు.

అయితే ఈ పోటీల గురించి మాట్లాడిన ప్రజ్ఞానంద్ ” కార్ల్సన్ టైబ్రేక్ కోసమే వేగంగా డ్రా చేయడానికి ప్రయత్నించినట్లు అర్థమైంది. ఇలా జరగడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. టోర్నీలో చాలా టైబ్రేక్ లు ఆడి అలసిపోయిన నాకు ఈ విధంగా రెస్ట్ దొరకడం మంచిదే కదా. గురువారం జరిగే పోటీలో పూర్తిస్థాయిలో ఆడే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది.” అని అన్నాడు. ఏదిఏమైనాప్పటికీ వయసులో ఎంతో చిన్నవాడైనా ప్రజ్ఞానంద్ ఇంత మెరుగైన ప్రదర్శన కనబరచడం భారతీయులందరికీ గర్వకారణం.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version