https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ కి సపోర్టు చేసి తప్పు చేశా..నన్ను క్షమించండి అంటూ స్టార్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 04:28 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రీమియర్ షోస్ రోజున సంధ్య థియేటర్ లో ప్రవర్తించిన తీరుని తప్పుబడుతూ, రేవతి చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం గా ఉండడమే అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని పెట్టి సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలే చెప్తున్నాడంటూ ఆయన పేరు ప్రస్తావించకుండా మాట్లాడాడు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి కౌంటర్ గా హైదరాబాద్ పోలీసులు ఆరోజు అసలు థియేటర్ లో ఏమి జరిగింది అనే దానిపై ఆధారాలతో సహా, పది నిమిషాల వీడియో ప్రూఫ్ ని మీడియా కి విడుదల చేసారు.

    ఈ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ తప్పు చేసాడు, ప్రెస్ మీట్ ముందు అబద్దాలు ఆడాడు అంటూ పెద్ద ఎత్తున ఆయనపై నెగటివిటీ ఏర్పడింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినా రోజున పలువురు సినీ ప్రముఖులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తప్పుబట్టారు. జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు అల్లు అర్జున్ ఒక్కడిని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వారిలో జాతి రత్నాలు ఫేమ్ రాహుల్ రామ కృష్ణ కూడా ఉన్నాడు. ఈయన టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ మోస్ట్ కమెడియన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన పోలీసుల తీరును తప్పుబడుతూ ఒక పెద్ద వ్యాసమే రాసాడు ట్విట్టర్. అయితే నిన్న పోలీసులు విడుదల చేసిన వీడియో ని చూసిన తర్వాత రాహుల్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.

    ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన గురించి నాకు చాలా తప్పుడు సమాచారం అందింది. అందుకే ఆరోజు నేను చేసిన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను’ అంటూ ఆయన ఒక ట్వీట్ వేసాడు. ఇక్కడ జరిగిన సంఘటన గురించి కానీ, ఎవరి వల్ల అది జరిగింది అనే దాని గురించి కానీ ఆయన నేరుగా స్పందించలేదు. పరోక్షంగానే స్పందించాడు. కానీ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతుంది. రాహుల్ రామకృష్ణ కేవలం ఈ ఒక్క విషయం లోనే కాదు, సమాజం లో జరిగే అనేక విషయాలపై ఆయన నిర్మొహమాటంగా సోషల్ మీడియాని వేడుక చేసుకొని కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆయన చేసే కామెంట్స్ కి నెటిజెన్స్ పలుసార్లు ట్రిగ్గర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆయన గతం లో చేసిన సందర్భాలు ఉన్నాయి.