ఆస్ట్రేలియా పర్యటనకు జట్లు: మరో వివాదంలో బీసీసీఐ

క్రికెట్‌ ఆడే అన్ని దేశాల్లోకెల్లా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చాలా రిచ్‌. ఎంత రిచ్‌ వ్యవస్థనో ఇక్కడ అన్ని రాజకీయాలు కూడా. ప్రతిభను ఆధారంగా చేసుకొని అవకాశాలు కల్పించడం.. ప్రతిభ ఆధారంగా కెప్టెన్సీలు అప్పజెప్పడం చేయాలి. కానీ.. ప్రతీ విషయంలోనూ బీసీసీఐ వివాదాల్లో చిక్కుకుంటోంది. రాజకీయాలతో పాటు కులం కూడా చొరబడినట్లుగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు. Also Read: ఐపీఎల్: ఈ సండే మళ్లీ ఏమైంది? ఇదివరకు అంబటి రాయుడు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలే […]

Written By: NARESH, Updated On : October 27, 2020 12:36 pm
Follow us on

క్రికెట్‌ ఆడే అన్ని దేశాల్లోకెల్లా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చాలా రిచ్‌. ఎంత రిచ్‌ వ్యవస్థనో ఇక్కడ అన్ని రాజకీయాలు కూడా. ప్రతిభను ఆధారంగా చేసుకొని అవకాశాలు కల్పించడం.. ప్రతిభ ఆధారంగా కెప్టెన్సీలు అప్పజెప్పడం చేయాలి. కానీ.. ప్రతీ విషయంలోనూ బీసీసీఐ వివాదాల్లో చిక్కుకుంటోంది. రాజకీయాలతో పాటు కులం కూడా చొరబడినట్లుగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

Also Read: ఐపీఎల్: ఈ సండే మళ్లీ ఏమైంది?

ఇదివరకు అంబటి రాయుడు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలే మరోసారి తలెత్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కులం అనే ప్రాతిపదిక మీదే అంబటి రాయుడికి భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించలేదంటూ అభిమానులు అప్పట్లో విరుచుకుపడ్డారు. అలాంటి ఆరోపణలు, విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వెన్నెముక సూర్యకుమార్ యాదవ్‌కు భారత క్రికెట్ జట్టులో చోటు దక్క లేదు. దీనిపై అభిమానులు భగ్గుమంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణిస్తున్నా అతనికి జాతీయ జట్టులో బెర్త్ కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. #JusticeForSuryakumarYadav అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నప్పటికీ.. అతని ప్రతిభను బీసీసీఐ సెలెక్టర్లు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఐపీఎల్‌ ద్వారా సూర్యకుమార్‌‌కు ఫ్యాన్స్‌ పెరిగిపోయారు. అతడి ఆట తీరు చూసి ఫిదా అవుతున్నారు. అయితే.. అభిమానుల్లో అంతలా క్రేజీ పెరగడానికి ఒకసారి అతని ట్రాక్‌ రికార్డు కూడా చూస్తే.. 2018 సీజన్ నుంచీ అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్–2018లో 512 పరుగులు, ఐపీఎల్–2019లో 424 పరుగులు సాధించాడు. ఈ రెండు సీజన్లలో అతని బ్యాటింగ్ యావరేజ్.. 36.57, 32.61గా నమోదైంది. ఐపీఎల్–2020 సీజన్‌లో ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 283 రన్స్ చేశాడు. ఈ మూడు సీజన్లలో 1219 పరుగులు అతని అకౌంట్‌లో ఉన్నాయి. ఓ బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నాడనడానికి డేటాతో సహా సాక్ష్యాలను చూపిస్తున్నారు అభిమానులు.

అయితే.. ఐపీఎల్‌లో రాణించినంత మాత్రాన భారత్‌ జట్టులోకి తీసుకోవాలనే రూల్స్‌ ఏమీ లేవు. కానీ.. స్పిన్నర్‌‌ వరుణ్‌ చక్రవర్తి, మనీష్‌ పాండే, వాషింగ్టన్‌ సుందర్‌‌, నవదీప్‌ షైనీ, దీపక్‌ చాహర్‌‌, సంజు శాంసన్‌, శుభ్‌మన్‌ గిల్‌, వీరంతా ఐపీఎల్‌ నుంచి వచ్చిన వారే. ఐపీఎల్‌లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారిని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. మరి అలాంటప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను ఎందుకు పక్కన పెట్టారనేది అభిమానుల ప్రశ్న. ఇదివరకు ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో అంబటి రాయుడిని తీసుకోకపోవడానికి కులం కారణమని, ఇప్పుడూ అదే తరహా పరిస్థితులు బీసీసీఐలో కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు ఫ్యాన్స్.

ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టును సోమవారం రాత్రి బీసీసీఐ ప్రకటించింది. టీ20, వన్డే, టెస్టుల కోసం ప్రత్యేకంగా జట్లను ఎంపిక చేసింది. టీ20 కోసం విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేసింది.

Also Read: చెన్నై రిటర్న్‌ బ్యాక్.. జీర్ణించుకోలేకపోతున్న ధోని ఫ్యాన్స్

భారత వన్డే టీమ్‌లో విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, శార్దుల్ ఠాకుర్‌లను తీసుకున్నారు.

టెస్టుల్లో విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, హనుమ విహారీ, శుభ్‌మన్ గిల్, వృద్ధీమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్‌లకు చోటు కల్పించారు.