Team India Captaincy: విరాట్ కోహ్లీ కెప్టెన్ గా దిగిపోతూ తన తదుపరి వారసుడు కేఎల్ రాహుల్ అని.. అతడినే కొత్త కెప్టెన్ గా చేయాలని బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లకు సూచించాడు. కానీ కోహ్లీ ప్రతిపాదనలను పక్కనపెట్టి వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్ ను చేశారు. కోహ్లీ కోపానికి ఇది కూడా ఒక కారణం.
మొదటి నుంచి జట్టులో కోహ్లీకి, రోహిత్ శర్మకు పడడం లేదన్న ప్రచారం ఉంది. అందుకే రోహిత్ ను కాకుండా రాహుల్ ను చేయాలని కోహ్లీ పట్టుబట్టాడట.. పైగా రోహిత్ బరువు ఎక్కువగా ఉండి ఎప్పుడూ ఫిట్ నెస్ లేమితో గాయాల బారినపడడం కూడా అతడు కెప్టెన్ గా వద్దనడానికి కారణంగా చెబుతున్నారు.
Also Read: ఎన్టీఆర్ పేరుతో జిల్లా.. సీఎం జగన్ ‘కొత్త’ వ్యూహం వెనుక కారణమేంటి?
అయితే రోహిత్ మంచి ఆటగాడు.. అంతేకాదు.. తెలివైన కెప్టెన్. ఇప్పటికే ఐపీఎల లో ధోనితో సమానంగా ముంబైకి కప్ లు అందించి తను ఒక విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ నిరూపించుకున్నాడు.
అందుకే బీసీసీఐ సైతం విరాట్ కోహ్లీ సూచించిన కేఎల్ రాహుల్ ను పక్కనపెట్టి రోహిత్ నే కెప్టెన్ ను చేసింది. కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది.
అయితే తాజాగా దక్షిణాఫ్రికా టూర్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తేలిపోయింది. రెండో టెస్టులో ఓడిపోయింది. అనంతరం మూడు వన్టేల సిరీస్ లో మూడు ఓడిపోయి టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 3 మ్యాచ్ లలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.
అదే రోహిత్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా కంటే బలమైన న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ గా టీమిండియా ఓడించడం విశేషం.దీన్ని బట్టి కెప్టెన్సీ విషయంలో కేఎల్ రాహుల్ కంటే రోహిత్ నూరు పాళ్లు నయం. నాయకత్వ లక్షణాలున్న రోహిత్ ఫిట్ నెస్ మెరుగుపరుచుకుంటే అతడే విజయవంతమైన కెప్టెన్ కాగలడు. కానీ అతడికి గాయాలే శాపంగా మారాయి.
Also Read: ఏపీలోని స్కూళ్లలో కొత్త రూల్స్.. ఇక వాటిని పాటించడం కంపల్సరీ..