Team India superstars out: టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే కాదు బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా. టి20లలో విరాట్ కోహ్లీ, రోహిత్ హవా సాగుతున్నప్పుడు కూడా హార్దిక్ పాండ్యా, బుమ్రా తమ సత్తా చూపించారు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు. ఒకరకంగా టీమిండియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించారు.
టి20 లకు విరాట్, రోహిత్ వీడ్కోలు పలికారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా టి20లలో కొనసాగుతున్నారు. హార్దిక్ పాండ్యా ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్లో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అంతకుముందు సిరీస్ లలో కూడా హార్దిక్ పాండ్యా దుమ్ము రేపాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ లో హార్దిక్ పాండ్యా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫీల్డింగ్ విషయంలో మెరుపులు మెరిపిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్లో, బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. వైజాగ్ లో జరిగిన నాలుగవ టి20 మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హార్థిక్ పాండ్యా మైదానం లోకి వచ్చాడు. కానీ అతడు తన పాత ఆట ను మర్చిపోయినట్టుగా బ్యాటింగ్ చేశాడు. సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ కావడంతో టీమిండియా ఓటమి లాంచనమైంది.
బుమ్రా కూడా సరిగ్గా బౌలింగ్ వేయలేకపోతున్నాడు. మూడో టి20 మ్యాచ్లో అదరగొట్టినప్పటికీ.. నాలుగో మ్యాచ్ కు వచ్చేసరికి తేలిపోయాడు. కొన్ని వికెట్లు సాధించినప్పటికీ.. చివరి ఓవర్ లో 20 పరుగులు ఇచ్చాడు. బుమ్రా స్థాయికి అలా పరుగులు ఇవ్వడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీమిండియాలో ప్రధాన బౌలర్ గా బుమ్రా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇలా బౌలింగ్ చేయడం పట్ల సగటు టీం ఇండియా అభిమాని నిర్వేదం వ్యక్తం చేస్తున్నాడు. “బుమ్రా నాలుగో t20 మ్యాచ్ ఓటమిని ఒక రకమైన అనుభవం లాగా మార్చుకోవాలి. ఇలాంటి బంతులు వేయకుండా మరోసారి జాగ్రత్త పడాలి. టి20 లలో టీమిండియా తరఫున మిగతా బౌలర్లు ఎలా బౌలింగ్ వేసినా సరే.. బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ వేయాలి. ఎందుకంటే అతడి మీదనే టీమిండియా బౌలింగ్ ఆధారపడి ఉందని” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా బుమ్రా, హార్దిక్ పాండ్యా మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే కీలక సమయంలో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ఒకరు బంతితో.. మరొకరు బ్యాట్ తో అదరగొడతారు. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్ ను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే అతడు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వికెట్ తీసి టీమిండియాలో ఆనందాన్ని నింపాడు. తద్వారా అనేక సంవత్సరాల విరామం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ అందుకుంది. ఈసారి కూడా హార్థిక్ పాండ్యా నుంచి అభిమానులు ఆ తరహా ప్రదర్శనను ఆశిస్తున్నారు. దానికంటే ముందు అతడు పూర్వపు ఫామ్ అందుకోవాలని కోరుకుంటున్నారు.