Mana Shankara Varaprasad Garu Collection Day 17: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ, ముందుకు దూసుకుపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం స్పీడ్ కి 17వ రోజున బ్రేకులు పడ్డాయి. ప్రీమియర్స్ తో కలిపి వరుసగా 16 రోజుల పాటు నాన్ స్టాప్ కోటికి పైగా షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లిన ఈ చిత్రానికి 17వ రోజున కోటి రూపాయిల కంటే తక్కువ షేర్ తెలుగు రాష్ట్రాల నుండి నమోదైంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 17 వ రోజున 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. బుక్ మై షో యాప్ లో కూడా నిన్న కేవలం 15 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంతకు ముందు రోజు ఈ చిత్రానికి పాతిక వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఇకపోతే మొత్తం మీద ఈ చిత్రానికి 17 రోజులకు గానూ తెలుగు రాష్ట్రాల నుండి 141 కోట్ల రూపాయిల షేర్ వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 215 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూస్తే 173 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 284 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి క్లోజింగ్ లో 290 నుండి 300 కోట్ల గ్రాస్ మధ్యలోనే వచ్చేటట్టుగా అనిపిస్తుంది. మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు దాటినట్టు పోస్టర్లు విడుదల చేశారు. కానీ వాస్తవానికి ట్రేడ్ లెక్కల్లో వచ్చిన వసూళ్లు ఇవే. ఈ వీకెండ్ మెరుగైన కలెక్షన్స్ గ్రోత్ చూపించకుంటే, 300 కోట్ల రూపాయిల లోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమాలు అయినటువంటి ‘దేవర’, ‘ఓజీ’ లను అవలీలగా దాటేసింది కానీ, నైజాం ప్రాంతంలో మాత్రం బాగా వెనుకబడింది. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే చిరంజీవి గత సూపర్ హిట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కంటే ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్స్ ఆఫీస్ రన్ బాగా తగ్గిందని అంటున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు రిటర్న్ జీఎస్టీ తో కలిపి నైజాం ప్రాంతంలో 44.58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్ వసూళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా అనుకున్నంత రన్ రాలేదు. ఈ రెండు ప్రాంతాల్లోనే కాస్త తగ్గింది. లేదంటే ఈ చిత్రం నిజంగానే 350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది.