Bhartha Mahasayulaku Wignyapthi Closing Collections: పాజిటివ్ టాక్ వస్తే రవితేజ(Mass Maharaja Raviteja) సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆయన కెరీర్ లో ఫ్లాప్స్, డిజాస్టర్స్ కొత్తేమి కాదు, కానీ ఎన్ని డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు చేసినా, ఒకే ఒక్క సరైన పాజిటివ్ టాక్ సినిమా పడితే దిమ్మ తిరిగే రేంజ్ లో కం బ్యాక్ ఇవ్వడం రవితేజ స్టైల్. కానీ కెరీర్ లో మొట్టమొదటి సారి ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, డిజాస్టర్ గా మిగలడం జరగడం ఈ సంక్రాంతి లోనే చూస్తున్నాం. ఆయన హీరో గా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku Wignapti) కి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక రవితేజ కం బ్యాక్ ఇచ్చినట్టే అని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టం ఈ సినిమా తర్వాత విడుదలైన సినిమాలకు, ఇంతకంటే గొప్ప టాక్ రావడం తో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని ఆడియన్స్ పట్టించుకోలేదు.
ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ క్లోజ్ అయ్యింది. క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి దాదాపుగా 3.17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రవితేజ కి బలమైన ప్రాంతాల్లో ఒకటి నైజాం. అలాంటి చోట పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఒక చిత్రానికి ఇంత తక్కువ వసూళ్లు రావడం గమనార్హం. ఇక సీడెడ్ లో అయితే కేవలం 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. రవితేజ లాంటి మాస్ హీరో కి సీడెడ్ లాంటి ప్రాంతం లో కనీసం కోటి రుపాయిల షేర్ వసూళ్లు కూడా రాకపోవడం, రవితేజ ఇమేజ్ కి అత్యంత అవమానకరమైన విషయం. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే దాదాపుగా 5 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏ చిత్రానికి క్లోజింగ్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 20 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే 8 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు ఈ చిత్రానికి వచ్చాయట. కమర్షియల్ గా ఇది ఘోరమైన డిజాస్టర్ అనే చెప్పొచ్చు.