https://oktelugu.com/

IND VS BAN Test : అశ్విన్ తో గేమ్సా.. వికెట్లు ఎగిరిపోతాయి.. వీడియో వైరల్

చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్ విన్యాసాన్ని ప్రదర్శించాడు. పర్యాటక బంగ్లాదేశ్ జట్టుకు చుక్కలు చూపించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 21, 2024 / 10:33 PM IST

    Ravichandran Ashwin

    Follow us on

    IND VS BAN Test : తొలి ఇన్నింగ్స్ లో 144/6 వద్ద భారత్ నిలిచినప్పుడు ఆపద్బాంధవుడి లాగా రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. రవీంద్ర జడేజా తో కలిసి ఏడో వికెట్ కు 199 పరుగులు జోడించాడు. బౌలింగ్ మాత్రమే కాదు బ్యాట్ తోనూ సత్తా చాటగలనని నిరూపించాడు. ఇన్నింగ్స్ లో బంతితో అశ్విని పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం సొంతమైదానంలో బంతితో మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన బుర్రకు పదును పెట్టి బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకుంటున్నాడు. తన బౌలింగ్ వ్యూహంలో బంగ్లా బ్యాటర్లను చిక్కుకునేలా చేసి.. అదరగొడుతున్నాడు.. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్లకు ఊహించని విధంగా బంతులు వేస్తూ.. రెచ్చిపోయాడు. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించాడు. అశ్విన్ మాయాజాలానికి, రోహిత్ శర్మ మేధోజాలం తోడు కావడంతో బంగ్లా బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ అయ్యారు. ముఖ్యంగా బంగ్లా ఓపెనర్ షాదాన్ ఇస్లాం (35) ను అశ్విన్ అత్యంత తెలివిగా అవుట్ చేశాడు. ఇస్లాం కు అశ్విన్ నేరుగా బంతిని డెలివరీ చేశాడు. దీంతో అతడు ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతి మిడ్ వికెట్ లో తక్కువ ఎత్తులో లేచింది. అయితే అక్కడే ఉన్న గిల్ అత్యంత చాకచక్యంగా క్యాచ్ పట్టాడు.. ఇక ఇదే దశలో మోమినుల్ హక్(13)ను క్లీన్ బోల్డ్ చేశాడు. అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.. ఆ బంతిని హక్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతి డిఫెన్స్ ను దాటుకొని వికెట్లను పడగొట్టింది. ఆ బంతిని చూసి మైదానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. ఇక టెస్ట్ క్రికెట్లో హక్ ను అశ్విన్ అవుట్ చేయడం ఇది నాలుగోసారి.. అనంతరం సిక్స్ కొట్టి అంచనాల కందని ఉత్సాహంతో ఉన్న ముష్ఫికర్ రహీం (13) ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆ బంతిని రాహుల్ చాకచక్యంగా అందుకున్నాడు. గత 11 ఇన్నింగ్స్ లలో రహీం ను అశ్విన్ అవుట్ చేయడం ఇది అయిదవ సారి.

    ఇన్నింగ్స్ ముగిసే సమయానికి

    శనివారం సాయంత్రం వాతావరణం మేఘావృతం కావడంతో మ్యాచ్ త్వరగా నే ముగిసింది. అయితే బంగ్లాదేశ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 357 రన్స్ చేయాల్సి ఉంది. బంగ్లా జట్టు కెప్టెన్ షాంటో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక మరో ఆటగాడు షకీబ్ ఉల్ హసన్ కూడా క్రీజ్ లో ఉన్నాడు. కాగా, అంతకుముందు 81/3 తో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 287/4 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గిల్ 119*, రిషబ్ పంత్ 109 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక బంగ్లా బౌలర్లలో మిరాజ్ రెండు వికెట్లు, తస్కిన్, న హీద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 రన్స్ చేసింది. రవిచంద్రన్ 113, రవీంద్ర జడేజా 86 పరుగులు చేసి ఆకట్టుకున్నా. బంగ్లా బౌలర్లలో హసన్ మహమ్మద్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లా 149 పరుగులకు ఆల్ అవుట్ అయింది. షకీబ్ అల్ హసన్ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బుమ్రా 4/50 నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు.