Health Tips : ప్రస్తుతం అంతా టెక్నాలజీమయం అయింది. ఏ పని చేయాలన్నా ఏదో ఒక గాడ్జెట్ ఉపయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా సాప్ట్ వేర్ జాబ్ చేసేవాళ్ల డెస్క్ టాప్, ల్యాప్ టాప్ యూజ్ చేయడం సర్వసాధారణమైపోయింది. వీటి ద్వారానే కొన్ని కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. తమ జీవిత లక్ష్యాన్ని చేరుతున్నారు. అయితే డబ్బు సంపాదించాలన్నా ఆరాటంతో పాటు వివిధ కారణాల వల్ల ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా ల్యాప్ టాప్ వాడేవారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో బయటపడింది. అయితనా కొందరికి తప్పడం లేదు. అయితే విధుల కారణంగా ల్యాప్ ట్యాప్ ను యూజ్ చేయడం వరకు ఒకే. కానీ కొందరు సరదా కోసం కూడా దీనిని ఒళ్లో పెట్టుకొని మరీ వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల సాధారణ అనారోగ్యాలే కాకుండా సంతానోత్సత్తికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
డేమ్ హెల్త్ కు చెందిన వైద్యులు రూబీ యాదవ్, డైటీషియన్ అండ్ డయాబెటీస్ ఎడ్యుకేటర్ మల్హొత్రా అనే ఇద్దరు దీనిపై పరిశోధనలు నిర్వహించారు. ల్యాప్ ట్యాప్ ను ఎక్కువగా ఒళ్లో పెట్టుకోవడం ద్వారా ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వారు తమ పరిశోధనల ద్వారా వివరించారు. వీరిలో డాక్టర్ రూబీ చెప్పిన ప్రకారం.. ల్యాప్ టాప్ నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత రిలీజ్ అవుతుంది. ఇవి వంధ్యత్వాన్ని ప్రోత్సహిస్తుంది. క్రమంగా ఇది స్క్రోటల్ హైపర్టెర్మియాకు కారణమవుతుంది. అసాధారణ ఉష్ణోగ్రత బయటకు రావడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా ల్యాప్ ట్యాప్ యూజ్ చేసే వ్యక్తి డీఎన్ ఏ పై ప్రభావం పడుతుంది. ఫలితంగా స్పెర్మ్ నాణ్యతను దెబ్బతిస్తుంది.. అని రూబీ యాదవ్ తెలిపారు.
డైటీషియన్ అండ్ డయాబెటీస్ ఎడ్యుకేటర్ మల్హొత్రా వివరిస్తూ ల్యాప్ టాప్ నుంచి ఎక్కువగా టెంపరేషన్ రిలీజ్ అవుతుంది. దీంతో దీనిని వాడే వ్యక్తి వృషణంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఒళ్లో ల్యాప్ టాప్ పెట్టుకున్న వారు ల్యాప్ టాప్ దగ్గరే వృషణాలు ఉండడం వల్ల నేరుగా వాటిపై ప్రభావం చూపుతాయి. దీంతో స్పెర్మాటోజెనిసిస్ కు ఆటంటకం ఏర్పడి తద్వారా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇది క్రమంగా సంతాన లేమికి కారణమవుతుంది. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రత వల్లే ఈ చర్యలు జరుగుతాయని మల్హోత్ర వివరించారు.
అయితే ల్యాప్ టాప్ కొందరిని తప్పనిసరి. విధుల కారణంగా దీనిని వాడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో వీరు ల్యాప్ టాప్ ను ఒళ్లో పెట్టుకోకుండా ప్రత్యేకమైన టేబుల్ ఏర్పాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా 30 ఏళ్ల లోపు పురుషులు అవసరమైతే తప్ప సరదా కోసం ల్యాప్ టాప్ ను ఒళ్లో పెట్టుకోవడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఒకవేళ పురుషులు ల్యాప్ ట్యాప్ యూజ్ చేసిన తరువాత ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా.. బీ 12, డీ3 లాంటి కీలక విటమిన్లు వాడాల్సి వస్తుంది. అలాగే జింక్, పోలెట్, జిన్సెంగ్ ఖనిజాలు లభించే పదార్థాలను తీసుకోవాలి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, డీఎన్ ఏ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.