Ravi Teja Rama Rao On Duty: రేపు రాబోతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ పై ప్రేక్షకుల్లో ఏవరేజ్ బజ్ ఉంది. సినిమాకి హిట్ టాక్ వస్తేనే.. భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే.. డైరెక్టర్ శరత్ మండవ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కిందామీదా పడుతున్నాడు. ఎప్పుడు లేనిది మాస్ మహారాజ్ రవితేజ కూడా ప్రమోషన్స్ లో భాగంగా వరస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సినిమా కోసం అదనపు సక్సెస్ టూర్లు కూడా ప్లాన్ చేసుకున్నారు.
మొత్తానికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ కోసం చిత్రబృందం ఇంతగా కష్టపడుతుంటే.. మరోపక్క పైరసీ రాయుళ్లు మాత్రం ఈ సినిమాలోని సీన్స్ ను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. రవితేజ సంభాషణలతో కూడిన ఆ సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ గా మారాయి. రేపు రిలీజ్ అవుతున్న సమయంలో ఇలా సీన్స్ లీక్ అవ్వడం ఈ సినిమా టీమ్ కి ఇది ఊహించని షాకే.
Also Read: Vijay Devarakonda Shocking Answer: విజయ్ దేవరకొండ షాకింగ్ ఆన్సర్.. అమ్మ బాబోయ్ భరించలేం ఈ బోల్డ్ !
ఈ లీక్స్ పై హీరో, నిర్మాతలు సైతం ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ లీక్ చేసిన వ్యక్తి ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు. రిలీజ్ కి ముందే సీన్స్ లీక్ అయ్యాయి కాబట్టి.. ఎవరో సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ చేసిన పనే అని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. ఎడిటింగ్ రూమ్ నుంచి రామారావు చిత్ర సన్నివేశాలు లీకైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా ఇన్ డైరెక్ట్ గా నిజమే అని నిర్ధారణ చేస్తోంది. లీకైన సన్నివేశంలో అధికార పార్టీపై విరుచుకుపడుతూ పరోక్షంగా రవితేజ చేసిన సంభాషణలు ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఖిలాడీ లాంటి ప్లాప్ సినిమా తర్వాత రవితేజ నటించిన సినిమా అయినప్పటికీ.. ఈ సినిమా పై ఆ ప్లాప్ ఇమేజ్ పడలేదు. ఇక, డబ్బింగ్ వెర్షన్స్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కలుపుకుంటే.. మరో పది కోట్లు వరకు ఉంటుంది. అంటే.. మొత్తం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 57 కోట్లు జరిగింది. కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ కావాలంటే.. కనీసం 57 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాలి.
Also Read: BJP Janasena: జనసేనతో పొత్తు.. ఏపీలో అధికారం కోసం బిగ్ స్టెప్ వేసిన బీజేపీ