IND VS BAN Test Match : ఆదివారం వర్షం కురువకపోవడం.. సోమవారం వాతావరణం తేలికగా మారడంతో మ్యాచ్ మొదలైంది. 107/3 తో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. అయితే బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 126 పరుగులు చేసి మిగతా 7 వికెట్లను కోల్పోయింది.. తొలి సెషన్ లో బంగ్లా జట్టు 31 ఓవర్లు ఆడి.. 98 పరుగులు చేసింది. అదే సమయంలో మూడు వికెట్లు నష్టపోయింది. ఈ క్రమంలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డర్లు బంతులను ఎక్కడి కక్కడే అడ్డుకున్నారు.. బుమ్రా చుక్కలు చూపించడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఆటగాడు మోమినుల్ హక్ 107* పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ నజ్ముల్ షాంటో 31 పరుగులతో సెకండ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బుమ్రా మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు సాధించారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించింది. కేవలం 34.4 ఓవర్లలోనే 285/9(డిక్లేర్) పరుగులు చేసింది. ఒక రకంగా టెస్టులలో టి20 తరహా బ్యాటింగ్ చేసింది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ రికార్డును బద్దలు కొట్టింది. ఒకటే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా భారత్ ఘనత అందుకుంది. 2022లో ఇంగ్లాండ్ జట్టు 89 ఇన్నింగ్స్ లలో 89 సిక్స్ లు కొట్టింది. ఇప్పుడు ఆ రికార్డును భారత్ జట్టు బ్రేక్ చేసింది. కేవలం 14 ఇన్నింగ్స్ లోనే 90 సిక్సులు కొట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది. బంగ్లాదేశ్ జట్టుతో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బజ్ బాల్ ఆటతో టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఇంగ్లాండ్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లో సిక్సర్లు కొట్టడంలో భారత జట్టు ఆటగాళ్ల కంటే చాలా వెనుకంజలో ఉన్నారు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు 60 సిక్స్ లు కొట్టి రెండవ స్థానంలో ఉన్నారు. 51 సిక్స్ లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది .
వారిద్దరిదే కీలకపాత్ర
టీమిండియా ఈ సిక్సర్ల రికార్డును అందుకోవడంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్ క్రికెట్లో ప్రారంభించే ఎదురు దాడికి దిగుతూ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్ ల సహాయంతో 23 పరుగులు చేశాడు. ఉన్నంతసేపు మైదానంలో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్స్ ల సహాయంతో 72 రన్స్ చేశాడు. ఈ జోడి కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేయడం విశేషం. ఇదే క్రమంలో టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 50 ఫార్ములు చేసిన జట్టుగా భారత్ సరికొత్త ఘనతను అందుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 26 బంతుల్లో చేసిన 50 పరుగులు రికార్డుగా ఉండేది. ఈ రికార్డును భారత జట్టు ఇప్పుడు అధిగమించింది.ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. టెస్టు క్రికెట్‌లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన టీమ్‌గా రికార్డుల్లోకెక్కింది.