Asian Games 2023: చైనా నిర్వహిస్తున్న ఏషియన్ గేమ్స్ లో భాగంగా పురుషుల క్రికెట్ విభాగానికి సంబంధించి ఇవాళ్ల ఇండియన్ క్రికెట్ టీం కి ఆఫ్గనిస్తాన్ టీం కి మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ టీం 18 ఓవర్ల రెండు బంతులకి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది.ఇంకా అంతలోనే వర్షం రావడం తో మ్యాచ్ కి కొద్దిసేపు అంతరాయం కలిగింది.అయితే వర్షం కుండపోత గా కురవడం అసలు ఎంత టైం అయిన తగ్గిపోవడం తో కొద్దీ సేపు వెయిట్ చేసారు. ఇక చివరికి వర్షం తగ్గినప్పటికీ గ్రౌండ్ ని సరిగ్గా కప్పక పోవడం తో అవుట్ ఫీల్డ్ అంత వర్షం తో తడిసిపోయింది అలా తడిసిన పిచ్ పైన ఆడటం చాలా కష్టం అవుతుంది.
అసలు అలాంటి పిచ్ మీద ఆడటానికి కూడా వీలు ఉండదు ఇక ఆ పిచ్ మొత్తాన్నిపరిశీలించిన ఎంపైర్ మ్యాచ్ ని కొనసాగించడం కష్టం అని ఆ మ్యాచ్ ని రద్దు చేయడం జరిగింది.నార్మల్ మ్యాచ్ అయితే రద్దు చేసినప్పుడు చెరొక పాయింట్ ఇస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్ ని మాత్రం అలా చేయడం కుదరదు. ఎందుకంటే దానికి ఎవరో ఒకరు మాత్రమే విన్నర్స్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏదో ఒక్క దాన్ని బేస్ చేసుకొని మ్యాచ్ ఎవరో ఒకరు గెలిచినట్టు గా ప్రకటిస్తారు.ఇంతకు ముందు 2019 లో వన్డే వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టీం ల మధ్య మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఆడారు సూపర్ ఓవర్ కూడా టై అయింది. దాంతో ఆ మ్యాచ్ లో ఎక్కువ బౌండరీలు కొట్టినందుకు గాను ఇంగ్లాండ్ టీం ని విన్నర్లు గా ప్రకటించడం జరిగింది.ఇక ఇప్పుడు కూడా ఆఫ్గనిస్తాన్ టీం కంటే మన టీం సీడింగ్ ఎక్కువ గా ఉండటం వల్ల ఫైనల్లో మన టీం గెలిచినట్టు గా ప్రకటించడం జరిగింది.
ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లలో షహీదుల్లా 49 పరుగులు చేశాడు.అలాగే గుల్బద్దీన్ 27 పరుగులు చేసి ఇద్దరు కూడా నాటౌట్ గా నిలిచారు.ఇక వీళ్ళిద్దరిని మినహా ఇస్తే వాళ్ల టీం లో ఎవరు పెద్దగా ఆడలేదు…మన బౌలర్లలో అర్షదీప్ సింగ్, శివమ్ దూబే,షాబాజ్ అహ్మద్,రవి బిష్ణోయ్ తల ఒక వికెట్ తీశారు…
ఇక ఈ మ్యాచ్ లో గెలిచి మన టీం గోల్డ్ మెడల్ గెలవగా,రన్నరప్ గా నిలిచినా ఆఫ్గనిస్తాన్ టీం సిల్వర్ మెడల్ గెలుచుకుంది.సెమిస్ లో ఓడిపోయిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీం పాకిస్థాన్ టీం కి పెద్ద షాక్ ఇచ్చింది…మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీం 5 ఓవర్లకి 48 పరుగులు చేసింది.అప్పుడు వర్షం రావడంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిపేయడం జరిగింది.ఇక వర్షం భారీ గా పడటం తో డక్ వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్ 5 ఓవర్లలో 65 పరుగులు కొట్టాలి అని నిర్ధారించగా, సరిగ్గా 5 ఓవర్లకి బంగ్లాదేశ్ 65 రన్స్ చేసింది…దాంతో బంగ్లాదేశ్ కి బ్రాంజ్ మెడల్ వచ్చింది.ఇక సెమిస్ దాక వచ్చిన కూడా పాకిస్థాన్ కి ఒక్క మెడల్ కూడా రాలేదు…
ఏషియన్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన మొదటి సీజన్ లోనే ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం,ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం రెండు కూడా గోల్డ్ మెడల్ కొట్టడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇండియన్ క్రికెట్ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందొ ఈ మెడల్స్ చూస్తే తెలిసిపోతుంది…