PVR: కేవలం రూ. 99 లకే ఐనాక్స్, పీవీఆర్ లో సినిమా..

ఓటీటీలో సినిమాలు రిలీజ్ అయినా సరే..ప్రజలు ఇప్పటికీ థియేటర్‌కి వెళ్లి పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఐనాక్స్, పీవీఆర్ లవర్స్ కు ఓ శుభవార్త.

Written By: Suresh, Updated On : October 7, 2023 5:54 pm

PVR

Follow us on

PVR: ఐనాక్స్ లో సినిమా చూస్తూ.. చేతిలో పాప్ కాన్ ఉంటే అబ్బ ఆ ఎంజాయే వేరు కదా.. దీనికి తోడు ఈ మధ్య చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా రీసెంట్ గా వచ్చిన ఫుక్రె 3, జవాన్ సినిమాలు థియేటర్ల వద్ద దుమ్ముదులుపుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు, అందులోనూ భారీ బడ్జెట్, బ్లాక్ బస్టర్ హిట్లు…ఇంకే టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని అందుకుంటాయి. మన దేశంలో సినిమాలకు ఒకరేంజ్ లో క్రేజ్ ఉంది. చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరో, హీరోయిన్ సినిమాలు మొదటిరోజు ఫస్ట్ షో చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ప్రస్తుతం ఓటీటీ మీడియంలో సినిమాలు చూసే ట్రెండ్ పెరిగింది.

ఓటీటీలో సినిమాలు రిలీజ్ అయినా సరే..ప్రజలు ఇప్పటికీ థియేటర్‌కి వెళ్లి పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఐనాక్స్, పీవీఆర్ లవర్స్ కు ఓ శుభవార్త. అదేంటంటే.. అక్టోబర్ 13, 2023న జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుకోనున్నారు. అందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని సినిమాల టిక్కెట్ ధరలను ఒక రోజుకి గాను.. కేవలం రూ.99కే అన్నిరకాల చిన్నా, పెద్ద థియేటర్లలో కేవలం 99 కే సినిమాను చూడోచ్చు..

PVR, INOX, Cinepoles, Mirage, Delight సహా దేశవ్యాప్తంగా 4,000 స్క్రీన్‌లు జాతీయ సినిమా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు చేతులు కలిపాయని MAI తెలిపింది. MAI ప్రకారం, సినిమా అభిమానులు అక్టోబర్ 13న రూ.99 చెల్లించి ఏ సినిమా అయినా చూడగలరు. రీక్లైనర్, ప్రీమియం ఫార్మాట్ సీటింగ్ సదుపాయానికి ఈ టిక్కెట్ ధర వర్తించదని ప్రేక్షకులు గమనించాలి. కేవలం 99 రూపాయలకే ఈ సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో కూర్చుని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఆస్వాదించవచ్చు.