https://oktelugu.com/

IND vs SL: రవీంద్రజడేజా దెబ్బకు మూడు రోజుల్లోనే టీమిండియా విజయం

IND vs SL: భారత యువ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకు శ్రీలంక చిగురుటాకులా వణికింది. సెంచరీ (175 నాటౌట్) చేయడంతోపాటు శ్రీలంక బ్యాటింగ్ ను కూల్చేశారు. ఏకంగా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి శ్రీలంక వెన్ను విరిచారు. రెండో ఇన్నింగ్స్ లోనూ 4 వికెట్లతో అదరగొట్టాడు. దీంతో శ్రీలంక కుప్పకూలింది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షోతో కేవలం మూడు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 6, 2022 / 06:45 PM IST
    Follow us on

    IND vs SL: భారత యువ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకు శ్రీలంక చిగురుటాకులా వణికింది. సెంచరీ (175 నాటౌట్) చేయడంతోపాటు శ్రీలంక బ్యాటింగ్ ను కూల్చేశారు. ఏకంగా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి శ్రీలంక వెన్ను విరిచారు. రెండో ఇన్నింగ్స్ లోనూ 4 వికెట్లతో అదరగొట్టాడు. దీంతో శ్రీలంక కుప్పకూలింది.

    శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షోతో కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ను ముగించింది. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. రవీంద్ర జడేజాకే మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

    విరాట్ కోహ్లీ తర్వాత తొలిసారి పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టారు. తొలి టెస్టులోనే రికార్డు విజయం సాధించాడు. ఇది విరాట్ కోహ్లీ 100 టెస్ట్ కావడం విశేషం. గెలుపును కోహ్లీకి ఈ సందర్భంగా టీమిండియా గిఫ్ట్ గా ఇచ్చింది.రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒకే రోజులో టీమిండియా శ్రీలంక 16 వికెట్లు కూల్చింది. రవీంద్ర జడేజానే 8 వికెట్లు తీయడం విశేషం.

    బ్యాటింగ్ లో రవీంద్ర జడేజా 175 పరుగులతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు 574/8 సాధించింది. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఫాలో ఆన్ ఆడించింది. ఇక శ్రీలంకను రెండో ఇన్నింగ్స్ లోనూ 178 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ లో దంచి కొట్టిన రవీంద్ర జడేజా.. బౌలింగ్ లోనూ 8 వికెట్లతో చెలరేగడంతో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది.