Ind vs Eng : ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. కోల్ కతా వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది. కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండవ వన్డే లోనూ అదే జోరును కొనసాగించింది. నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 304 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. రూట్ 69, డకెట్ 65 పరుగులతో ఆకట్టుకున్నారు. రవీంద్ర జడేజా 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అనంతరం 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 45 ఓవర్లలోపే లక్ష్యాన్ని చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (119) సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.. వైస్ కెప్టెన్ గిల్(60), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41*) రాణించారు.. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టాడు. లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, అట్ కిన్ సన్ తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు.
వరుసగా రెండవ సిరీస్
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా విజేతగా నిలిచింది.. ఆ సిరీస్ ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ఊపును వన్డే సిరీస్ లోను కొనసాగించింది.కోల్ కతా లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. అదే ఉత్సాహాన్ని రెండవ వన్డే లోను కొనసాగించింది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు.. రెండవ వన్డే లోనూ అదే జోరు కొనసాగించారు.. తద్వారా ఈ ఏడాది ఆస్ట్రేలియా తో సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టుతో టి20, వన్డే సిరీస్ లు గెలుచుకొని.. ఆ ఓటమి నుంచి కాస్త బయటపడ్డారు. మరి కొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో టీమిండియా వరుసగా రెండు సిరీస్ లు గెలవడం విశేషం. చాలాకాలం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది. అతడు మునిపటిలాగా బ్యాటింగ్ చేయడం.. ఏకంగా సెంచరీ కూడా కొట్టడంతో సోషల్ మీడియాలో మొత్తం రోహిత్ నామస్మరణ జరుగుతోంది. మొత్తానికి రెండు సిరీస్ లు గెలవడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.