https://oktelugu.com/

టీమిండియా నయా రికార్డు..

ఇంగ్లాండుతో జరిగిన ఆఖరు టీ 20లో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీ సేన ఈ సిరీస్ ను 3..2 తేడాతో కైవసం చేసుకుంది. ఒక ఇదే విజయంతో టీమిండియా… 2016 టీ 20 ప్రపంచకప్ తరువాత ఇంగ్లాండ్ పై అత్యధికంగా మూడుసార్లు పొట్టి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆ జట్టుపై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీంగా భారత్ అవతరించింది. Also Read: విభేదాలు మరిచి జోడు […]

Written By: , Updated On : March 21, 2021 / 02:11 PM IST
Follow us on

India T20 Wining moment
ఇంగ్లాండుతో జరిగిన ఆఖరు టీ 20లో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీ సేన ఈ సిరీస్ ను 3..2 తేడాతో కైవసం చేసుకుంది. ఒక ఇదే విజయంతో టీమిండియా… 2016 టీ 20 ప్రపంచకప్ తరువాత ఇంగ్లాండ్ పై అత్యధికంగా మూడుసార్లు పొట్టి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆ జట్టుపై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీంగా భారత్ అవతరించింది.

Also Read: విభేదాలు మరిచి జోడు గుర్రాలైన విరాట్ కోహ్లీ, రోహిత్

మొతేరా వేదికగా.. జరిగిన ఈ మ్యాచ్ లో తొతుల బ్యాటింగ్ చేసిన టీమిండియా 224 పరుగులతో భారీ స్కోచ్ చేసింది. స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ 34 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరు ఈ ఫార్మట్లో తొలిసారి ఓపెనింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ క్రీజ్లో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. కోహ్లీ నిలకడగా ఆడాడు. అలా వీరిద్దరు 9 ఓవర్లకే జట్టు స్కోర్ ను 90 పరుగులు దాటించారు.

Also Read: దంచికొట్టిన రోహిత్, కోహ్లీ.. భారత్ ఘనవిజయం

94 పరుగుల వద్ద రోహొత్ అవుటయ్యాక గేర్ మార్చిన కోహ్లీ సూర్యకుమార్ యాదవ్(32), హార్థిక్ పాండ్యా(37)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆపై ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జాస్ బట్లర్(52) డేవిడ్ మలన్(68) దంచికొట్టినా.. ఇతర బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. చివరికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 188 పరుగులతో సరిపెట్టుకుని ఓటమిపాలైంది.

టీ20లో టీమిండియాకు ఇంగ్లాండుపై ఇదే అత్యుత్తమ స్కోరు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మలన్ టీ20లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఫార్మట్లో అత్యధిక పరుగులు(1502) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 45 మ్యాచ్లలో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఒక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.