Melbourne Test : 173/9 వద్ద నిలిచిన ఆస్ట్రేలియా జట్టును 228/9 దాకా తీసుకెళ్లారు. దాదాపు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. బుమ్రా జడేజ వరకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. లయన్ 41 పరుగులు చేయగా.. బోలాండ్ పది పరుగులు చేశాడు. వాస్తవానికి ఆస్ట్రేలియా 173 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. చివరి వికెట్ కూడా వెంటనే పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంత సులభంగా ఆ అవకాశం భారత బౌలర్లకు దక్కలేదు. మ్యాచ్ ముగిసేంతవరకు బోలాండ్, లయన్ క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ దాదాపు 119 బంతులు ఎదుర్కొన్నారు. టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. పదో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియా జట్టులో అందరి ఆటగాళ్లను( కమిన్స్, లబూషేన్ మినహా) అవుట్ చేసిన టీమిండియా బౌలర్లు లయన్, బోలాండ్ విషయంలో మాత్రం ఆ సత్తా చూపించలేకపోయారు. ఎంత పదునైన బంతులు వేసినా వీరిద్దరూ మైదానంలో అలా పాతుకుపోయారు. అప్పటికే నాలుగో రోజు ఆట ముగియడంతో.. టీమిండియా నిరాశతో మైదానాన్ని వీడింది.
ఐదో రోజు ఏం చేస్తారో..
సోమవారం నాటితో మెల్ బోర్న్ టెస్టు ముగుస్తుంది. ఇప్పటికే టీమ్ ఇండియా పై ఆస్ట్రేలియా 333 పరుగుల లీడ్ లో ఉంది. లయన్, బోలాండ్ ను త్వరగా అవుట్ చేసి టీమిండియా ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని చేదిస్తే విజయం సాధ్యమవుతుంది. ఎందుకంటే మెల్ బోర్న్ లో గెలిస్తేనే టీమ్ ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. లేకపోతే దారులు మూసుకుపోతాయి. రోహిత్, రాహుల్, జైస్వాల్, కోహ్లీ, పంత్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు తమ దూకుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ తమ పూర్వపు లయను అందుకోవాల్సి ఉంది. గత టెస్టులలో వరుసగా విఫలమవుతున్న రోహిత్.. ఈ మ్యాచ్లో తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. టీమిండియా ఆటగాళ్లు t20 తరహాలో బ్యాటింగ్ చేస్తే తప్ప ఆస్ట్రేలియాపై విజయం సాధించడం దాదాపు అసాధ్యం. వేగంగా ఆడే క్రమంలో వికెట్లను పడగొట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందువల్ల ఆటగాళ్లు నిదానంగా ఆడాలి. బాధ్యతాయుతమైన ఆట తీరు ప్రదర్శించాలి. రెచ్చగొట్టే బంతులను వదిలిపెట్టి.. చెత్త బంతులను శిక్షిస్తేనే టీమిండియాకు ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాదు ఆటగాళ్లు తొందరపడకుండా… సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అప్పుడే గెలుపుపై భారత జట్టు ఆశలు పెంచుకోవచ్చు.