https://oktelugu.com/

OTT Movies : దేవర, లక్కీ భాస్కర్ తో పాటు నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్/సిరీస్లు, ఈ వీకెండ్ డోంట్ మిస్

డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ టాప్ 10 చిత్రాలు, సిరీస్ల లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ మూవీ లక్కీ భాస్కర్, దేవర సైతం ఉన్నాయి. ఈ వారాంతం ఈ టాప్ ట్రెండింగ్ మూవీస్/సిరీస్లను మిస్ కావద్దు. నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న నెంబర్ మూవీ ఏమిటో తెలుసా?

Written By:
  • Neelambaram
  • , Updated On : December 29, 2024 / 02:44 PM IST

    OTT Movie on Netflix

    Follow us on

    OTT Movies  నెట్ఫ్లిక్స్ ఇండియన్ డిజిటల్ మార్కెట్ ని కొల్లగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఒకింత స్ట్రగుల్ అవుతుంది. ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందుకే ప్రేక్షకులను ఆకర్షించేందుకు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కంటెంట్ ని అందుబాటులోకి తెస్తుంది. బడా స్టార్స్ చిత్రాలను, పాపులర్ వెబ్ సిరీస్లను చందాదారులకు అందిస్తుంది. హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమాల నుండి నెట్ఫ్లిక్స్ కి గట్టి పోటీ ఎదురవుతుంది.

    ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు/సిరీస్ల లిస్ట్ ఈ విధంగా ఉంది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ చిత్రాలు రెండు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ నటించి పీరియాడిక్ క్రైమ్ డ్రామా లక్కీ భాస్కర్ 5వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ రూ. 111 కోట్ల గ్రాస్ రాబట్టింది. నిర్మాతలకు లాభాలు పంచింది. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ చిత్రానికి అమరన్, క చిత్రాల నుండి పోటీ ఎదురైంది.

    ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. నవంబర్ 28 నుండి లక్కీ భాస్కర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక 6వ స్థానంలో దేవర ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర మూవీ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో దేవర రూ. 60 కోట్ల వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. జాన్వీ కపూర్ దేవర చిత్రంతో సౌత్ లో అడుగుపెట్టింది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. దేవరకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ మంచి వసూళ్లు రాబట్టింది.

    దసరా కానుకగా విడుదలైన దేవర మూవీ నవంబర్ 8 నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ప్రస్తుతానికి అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా టాప్ వన్ లో ట్రెండ్ అవుతుంది. అక్టోబర్ 11న జిగ్రా చిత్రాన్ని విడుదల చేశారు. ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓటీటీలో మాత్రం సత్తా చాటుతుంది.

    ఇక నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు/సిరీస్ల జాబితా ఇలా ఉంది

    1. జిగ్రా
    2. విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో
    3. అమరన్
    4. సికందర్ కా ముకద్దర్ & తంగలన్
    5. లక్కీ భాస్కర్
    6. దేవర
    7. మేరీ
    8. దట్ క్రిస్మస్
    9. దో పత్తి
    10. సత్యం సుందరం