https://oktelugu.com/

Team India: టీమిండియాలో ఆధిపత్యపోరుకు ముగింపు పలికేదెవరు?

Team India: భారత క్రికెట్లో నెలకొన్న కెప్టెన్సీ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. బీసీఐఐ, విరాట్ కోహ్లీ మధ్య రచ్చ కంటిన్యూ అవుతుండటం జట్టులోని ఆటగాళ్లను ప్రభావితం చేస్తోంది. దీంతో అసలు ఆట పక్కకు వెళ్లి ఆటేతర విషయాలు బయటికి వస్తున్నాయి. దీంతో అసలు భారత జట్టులో ఏం జరుగుతుందోననే చర్చ క్రికెట్ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. క్రికెట్లో కెప్టెన్సీ మార్పు అనేది సహజమే. ఏది ఒక్కరికి శాశ్వతం కాదు. వ్యక్తిగత ప్రదర్శన, నాయకత్వ లక్షణాలు, గెలుపొటముల […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2021 / 09:17 AM IST
    Follow us on

    Team India: భారత క్రికెట్లో నెలకొన్న కెప్టెన్సీ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. బీసీఐఐ, విరాట్ కోహ్లీ మధ్య రచ్చ కంటిన్యూ అవుతుండటం జట్టులోని ఆటగాళ్లను ప్రభావితం చేస్తోంది. దీంతో అసలు ఆట పక్కకు వెళ్లి ఆటేతర విషయాలు బయటికి వస్తున్నాయి. దీంతో అసలు భారత జట్టులో ఏం జరుగుతుందోననే చర్చ క్రికెట్ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.

    Team India

    క్రికెట్లో కెప్టెన్సీ మార్పు అనేది సహజమే. ఏది ఒక్కరికి శాశ్వతం కాదు. వ్యక్తిగత ప్రదర్శన, నాయకత్వ లక్షణాలు, గెలుపొటముల ఆధారంగా సంబంధిత బోర్డు ఆ జట్టుకు కెప్టెన్ ను నియమిస్తోంది. బీసీసీఐ కూడా అదే చేస్తోంది. అయితే కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తప్పించే సమయంలో బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదని సమాచారం. ఈ ఇష్యూనే ప్రస్తుతం టీంఇండియాలో వివాదానికి నాంది పలికినట్లు తెలుస్తోంది.

    భారత్ జట్టులో కెప్టెన్సీ వివాదం 2006 సంవత్సరంలో తొలిసారి బహిర్గతమైంది. ఆస్ట్రేలియా ఆటగాడు గ్రెగ్ చాపెల్ భారత జట్టు కోచ్ గా ఉన్నప్పుడు ఆట కంటే కూడా ఆటేతర విషయాల్లే ఎక్కువగా చర్చనీయాంశంగా మారాయి. నాడు కెప్టెన్ గా గంగూలీని తప్పించి రాహుల్ ద్రవీడ్ ను కెప్టెన్ గా అప్పగించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

    చాపెల్ తో గంగూలీ సహా స్టార్ క్రికెటర్లు ఇబ్బందిపడిన ఘటనలు ఉన్నాయి. ఈక్రమంలోనే బీసీసీఐ అతడిని తప్పించడంతో పరిస్థితులు సర్దుమణిగాయి. ద్రవిడ్ తర్వాత ధోనికి జట్టు పగ్గాలు దక్కడంతో అంతా సాఫీగా సాగిపోయింది. టీ20, వన్డే, టెస్టు అన్ని ఫార్మట్లలో ధోని సారథిగా భారత జట్టును ముందుండి నడిపించాడు.

    ధోని తర్వాత కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. కోహ్లీ ఆటగాడిగా, కెప్టెన్ గా మంచి ప్రదర్శననే కనబర్చాడు. అయితే ఇటీవలీ కాలంలో అతడు ఫామ్ కోల్పోవడం, కెప్టెన్ గా విఫలమవుతుండటం, ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలువకపోవడం మైనస్ గా మారింది. ఈక్రమంలోనే అతడు టీ20 జట్టు కెప్టెన్ గా తప్పుకున్నాడు.

    ఈక్రమంలోనే బోర్డు కోహ్లీని వన్డే కెప్టెన్ గా కూడా తప్పించింది. టీ20కి, వన్డేకు ఒకే కెప్టెన్ ఉండాలని బీసీసీఐ అనుకోవడం కరెక్టే అయినా కోహ్లీకి ముందుగానే నచ్చచెప్పాల్సిన అవసరం బోర్డు సభ్యులకు ఉంది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా టీ20, వన్డేలకు ఒకే కెప్టెన్ ఉంటాడని చెబితే సరిపోయిది.

    Also Read: ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త వైరస్.. 100 మంది మృతి?

    కానీ కోహ్లీ స్థాయి ఆటగాడికి కేవలం గంటన్నర ముందు సమాచారం అందించి వేటు వేయడం అతడికి నచ్చలేదు. ఇదే విషయాన్ని కోహ్లీ మీడియా ముఖంగా వెల్లడించాడు. బోర్డు మాత్రం కోహ్లీకి ముందుగానే సమాచారం ఇచ్చామని చెబుతోంది. దీంతో ఎవరి మాట నమ్మాలో తెలియడం లేదు.

    ఏదిఏమైనా బీసీసీఐ ఈ విషయంలో సరైన విధంగా వ్యవహరించలేదనే మాత్రం స్పష్టమవుతోంది. కెప్టెన్సీ వివాదం కాస్తా ఆటగాళ్ల మధ్య చిచ్చు పెడుతోంది. దీంతో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతిని అది జట్టుకు చేటుచేసేలా మారుతోంది. ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటికైనా సరైన విధంగా స్పందించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.

    Also Read: అప్పుడు స‌చిన్‌కు.. ఇప్పుడు విరాట్‌కు.. సేమ్ సీన్‌..!